Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ఉద్యోగుల డీఏలు ఇవ్వాలని,జీతాలు 1వ తేదినే వచ్చేలా చూడాలని, 317 జీవో ద్వారా నష్టపోయిన వారి సమస్యను పరిష్కరించాలని మాజీమంత్రి, మం థని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో డిమాండ్ చేశారు. ఉపాధ్యా యుల సర్వీస్ రూల్స్ తీసుకొచ్చి ప్రమోషన్ కల్పించాల న్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్న పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సిపిఎస్ ను రద్దు చేయాలని కోరారు. 317 జీవో ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులకు నష్టపోయినవారి సమస్యను పరి ష్కరించాలన్నారు. తెలంగాణ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ను తీసుకురావాలని కోరారు. లెక్చరర్స్ కానీ డిప్యూటీ లెక్చరర్స్ గాని ఎంఈఓ లు గాని ఇతర చాలామందికి ప్రమోషన్లు లేకుండా ఉన్నాయన్నారు. భాషా పండితుల ఉద్యోగుల సమస్యలను పరిష్క రించాలని కోరారు. ప్రతి పాఠశాలలో కూడా ఆలో చించి పిఈటి పోస్టులను, వారికి ప్రమోషన్ కలిపిం చాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఈహెచ్ఎస్ విధానం ద్వారా ఉద్యోగులకు నిమ్స్ ఆస్పత్రిలో తప్ప ఏ ఇతర ఆస్పత్రిలో అత్యవసర సమయంలో వైద్యా నికి పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడల్ స్కూల్ సంబం ధించిన ప్రమోషన్లు గానీ బదిలీలు గాని జరగడం లేదన్నారు. కేజీబీవీ పాఠశాలలో హాస్టల్లో వార్డెన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఉద్యోగుల మూడు డిఏ పెండింగ్ లో ఉన్నాయి వాటిని ఉద్యోగులకు అందించాలన్నారు. గత సంవత్సరం ఇచ్చిన పిఆర్సి ఎరియర్స్ ఇప్పటివరకు వారికి అందలేదని, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పదో తారీకు పదిహేను తారీకు రావడం జరుగుతుం దన్నారు. ఇది కాకుండా వారికి ఇతర రావాల్సిన బెనిఫిట్స్ , రావడం లేదన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు.
కాలేజీలు, నిధులు మంజూరు చేయాలి
మహదేవపూర్ : మంథని నియోజకవర్గానికి పీజీ కాలేజ్ మంజూరు చేయాలని, మంథని డిగ్రీ కాలేజ్, మాహదేవ్ పూర్ డిగ్రీ కాలేజీలకు నిధులు మంజూరు చేయాలని, పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ నిర్వహించాలని రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. తమ ప్రాంతంలోని మంథని డిగ్రీ కళాశాలలో అదనపు రూముల కోసం, మాహదేవ్ పూర్ డిగ్రీ కళాశాల లో కాంపౌండ్ వాల్ కోసం నిధులు కేటాయించాలని కోరారు. పాలిట క్నిక్ కళాశాల విద్యార్థులు మారుమూల ప్రాంతం నుంచి వచ్చ చదువుకుంటున్నారని, వారికి ఉన్నత చదువులకు ఉపయోగపడేలా డిప్లమా ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఐటీి తదితర కోర్స్‌లు తీసుక రావాలని కోరారు. మంథని మున్సిపల్లో ఉర్దూ మీడియం పాఠశాలకు స్థలం కేటాయించాలని, మాహదేవ్ పూర్ ఉర్దూ మీడియం పాఠశాలకు నిధులు కేటాయించాలని కోరారు.