Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య
నవతెలంగాణ- ములుగు
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు ఆరోగ్య నియమాలు పాటించాలని ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలోని సన్ రైజర్స్ హైస్కూల్ లో శుక్రవారం పాఠశాల కరస్పాండెంట్ పెట్టం రాజు ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎంహెచ్ఓ అప్పయ్య హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్య నియమాలను గురించి వివరించారు. విద్యార్థులు చేసిన వంటకాలు రుచి చూసారు. విద్యార్థులు తమ నైపుణ్యాలతో వివిధ రకాల వంటకాలను తయారు చేయడం, పండ్లతో వివిధ రకాల ఆకతులను తయారు చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ బలుగూరి జనార్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.