Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
- ఆర్పిఐ జిల్లా అధ్యక్షురాలు ధరావత్ శాంత
నవతెలంగాణ-భూపాలపల్లి
డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చేయడంలో పాలకులు అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారని అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకో వాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు ధరావత్ శాంత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వెలిశాలపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై నిరుపేదలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏరుపాటైన క్రమంలో జయశంకర్ భూపాల పల్లి జిల్లా కలెక్టర్గా ఆకునూరు మురళి విధులు నిర్వ హిస్తున్నప్పుడే 2016లో నాణ్యతతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేశారని తెలిపారు. 20 18లోనే పంపిణీ చేయాల్సిన ఇండ్లను ఇప్పటివరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. భూపాలపల్లి పట్ట ణంలో 30 సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్నా, ఇంటి స్థలాలు లేక చాలా అవస్థలు పడుతున్న నిరు పేదలకు ఇండ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశా రు. ఈ సమస్యపై గత నెల రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం ముందు నిరుపేద మహిళలతో కలిసి దీక్షలు చేపట్టడం జరిగిందని మాజీ కలెక్టర్ ఆకు నూరి మురళితో కలిసి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు సమస్య వివరించినట్టు తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ పది రోజులలోగా ఇండ్లను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. దీంతో జనవరి 3న మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి తో కలిసి మరోసారి నిరసన చేపడుతున్న క్రమంలో భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలిపారు. చేసేదేం లేక పోలీస్ స్టేషన్ లోనే నిరసన చేపట్టడంతో స్థానిక తహసిల్దార్ మహమ్మద్ ఇక్బాల్ ఈనెల 10వ తేదీలోగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. మరోసారి నిరుపేదలతో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాలుగవ అంతస్తు పై నిరసన వ్యక్తం చేస్తు న్నట్టు తెలిపారు. అధికారులు పాలకులు స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని డి మాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ పి అవినాష్ సంఘటన స్థలానికి చేరుకొని శివరాత్రి లోగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ నిరసన కొనసాగించారు . ఇండ్లు లేని నిరుపేదలు సుమారు 100 మంది పాల్గొన్నారు.
భారీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం పేదలు నాలుగవ అంతస్తు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేయ డంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి ఎస్సై-1 బండి రామకష్ణ, ఎస్సై-2 ప్రశాంత్, లతోపాటు పోలీస్ సిబ్బంది భారీగా చేరుకున్నారు. నిరసన విరమించాలని నచ్చ జెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విఫలం కావడంతో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సాయంత్రం సొంత పూచి కత్తుపై విడుదల చేశారు.