Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీనియర్ జర్నలిస్ట్ దూలం రాజమౌళి
నవతెలంగాణ-భూపాలపల్లి
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు వారికే కేటాయిం చాలని ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని సీని యర్ జర్నలిస్ట్ దూలం రాజమౌళి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్న లిస్టులు చేపట్టిన నిరవధిక దీక్షలు శుక్రవారం నాటికి 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జర్న లిస్టులకు పూలమాలవేసి దీక్షను ప్రారంభించి మద్దతు తెలిపి ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం లోని పుల్లూరి రామయ్య పల్లి శివారు లో 141 సర్వే నెంబర్లో 50మంది జర్నలిస్టులకు 2013లో ఎమ్మె ల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో పట్టాలు ఇచ్చారని తెలిపారు. కానీ, కలెక్టర్ పట్టాలను రద్దుచేస్తూ నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. జర్నలిస్టులు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బోరు కూడా వేశారని తెలిపారు. విద్యుత్ మీటర్లు కూడా అమ ర్చారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరే ట్ కార్యాలయం ముందు 80 ఫీట్ల రోడ్డును కూడా వదిలి ఇళ్ల స్థలాల్లో కొంతమంది జర్నలిస్ట్ లు లక్షలు ఖర్చు పెట్టి ఇంటి నిర్మాణలు చేశారని తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ వెంటనే స్పందించి పట్టాల రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే జర్నలిస్టుల పోరా టంలో ముందుండి పోరాడుతామని హెచ్చరించా రు. కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.