Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
సమాచార హక్కు చట్టాలపై అధికారులు అవగా హన కలిగి ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అ న్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై ఓరియెంటేషన్ ప్రోగ్రాం సమాచార హక్కు చట్టం-2005 వివిధ సెక్షన్లపై జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. శంకర్‌నాయక్ హాజరై మాట్లాడుతూ సమా చార హక్కు చట్టంలో ఉన్న వివిధ సెక్షన్లపై ప్రతి శాఖ అధికారి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పతి కార్యాలయంలో పౌర సమాచార అధికారి హౌదా ఫోన్ నెంబర్ సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో 16 కాలం, 8 కాలం చాప్టర్ తో కూడిన రిజిస్టర్ తప్పనిసరి పాటించాలని అన్నారు. సమాచారం కోరిన వ్యక్తులకు 30 రోజులలో మొదటి అప్పిల్ కింద సమాచారం అందించాలని సూచిం చారు. రాష్ట్ర స్థాయిలో 39 వేల కేసుల్లో 34 వేల పైచిలుకు కేసులను, ములుగు జిల్లాలో 140 అప్పిళ్లకు గాను 90 అప్పిళ్లను పరిష్కరించా మన్నారు. మిగిలినవి త్వరలో పరిష్కారం చేస్తామని అన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ రెవిన్యు వై వి గణేష్, డి ఆర్ ఓ రమాదేవి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ భాస్కర్, సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు స్వాగతం పలికారు. సిపిఓ ప్రకాష్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.