Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ పిలుపు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామపంచాయితీ సిబ్బంది సమస్యల పరి ష్కారానికై సీఐటీటీయూ ఆధ్వర్యంలో ఈనెల 12న పాదయాత్ర పాలకుర్తిలో ప్రారంభమవుతుందని, ప్రారంభ సభకు జిల్లాలోని పంచాయితీ సిబ్బంది మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పాదయాత్ర వాల్ పోస్టర్స్ ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నాయకత్వంలో పాదయాత్ర పాలకుర్తిలో ప్రారంభమై ఫిబ్రవరి 28న హైదరాబాదులోని ఇందిరా పార్కులో ముగుస్తుందని తెలిపారు. 17 రోజులపాటు 300 కిలోమీటర్ల మేర పాదయాత్ర సా గుతుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చిందని, లేబర్ కోడ్ లు గ్రామపంచాయితీ సిబ్బందికి నష్టమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా జీవో నెంబర్ 51 ద్వారా కార్మికులకు మల్టీపర్పస్ విధానంతో కనీస వేతనం 8500 గా నిర్ణయం చేసిందని విమర్శించారు. 4లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలేక్టర్ లకు ప్రత్యేక హౌదా కల్పించాలని, పంచాయితీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని, డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇవ్వాలని, దళిత బందు పథకం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సమ్మేట రాజమౌళి, కుమ్మరికుంట్ల నాగన్న, గ్రామ పంచాయితీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రత్నం అశోక్, బండ్ల అప్పిరెడ్డి లతో పాటు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.