Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఓల్డ్ బస్సు డిపో వద్ద నూతనంగా మార్కెట్ లను నిర్మిస్తున్నారని, ఇందులో చేపల మార్కెట్ కూడా ఉన్నదని, ఇందులో చేపలను అమ్ముకోవడానికి స్థానికంగా 20 ఏండ్ల నుండి ఓల్డ్ బస్సు డిపో వద్ద, ఆర్అండ్బీ ఆఫిస్ ఎదురు రోడ్ పై చేపలు అమ్ము కుంటున్న మత్స్యకారులకు చేపలు అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని టీఎంకేఎంకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్ కోరారు. శుక్రవారం సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో ఓల్డ్ బస్ డిపో చేపల అడ్డా మత్స్యకారులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అంద చేస ఆయన మాట్లాడారు. వరంగల్ నగరంలోని ప్రతి కార్పొరేషన్ డివిజన్లో రిటైల్ చేపల మార్కెట్ ఏర్పాటు చేసి మత్స్య కారులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్బంగా కలెక్టర్ స్పందిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, పరిశీలించి తగిన న్యాయం చేస్తామని హా మీనిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు నిమ్మల విజేందర్, ఓల్డ్ బస్సు డిపో చేపల అడ్డా మత్స్య కారులు చిరుత శ్రీలత, పోలు పద్మ, జంగిడి రాజిత, వనమాల, ముప్పారం ధనలక్ష్మి, గుండె పద్మ, సంగినేని స్వప్న, జల్లి వనమాల, జర్ర శిరీష, మౌటం రామ, దాసరి రాజేశ్వరి, మంజుల, స్వప్న తదితరులు పాల్గొన్నారు.