Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
చేపల వృత్తిలోనే కాకుండా విద్యా, ఉద్యోగ రంగాల్లో సైతం పాగా వేయాల నే ఆలోచనతో ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలం గాణ రాష్ట్రం యూనియన్ (మెపా) ఆధ్వ ర్యంలో వరంగల్‌లోని ఇండియన్ మెడి కల్ అసోసియేషన్ (ఐఎంఏ) హాలులో శ నివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఈ మేళాకు వివిధ హెచ్ డీఎఫ్సీ, ఐస ిఐసీఐ, ఎస్బీఐలైఫ్, ఎస్బీఐ కార్డ్, జీయో, శ్రీరాం తదితర కంపెనీల ప్రతి నిధులు రాగా, ఉమ్మడి వరంగల్‌లోని వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా ఉద్యోగార్థులు హాజరవ్వగ 60 మంది ఎంపిక అయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ హాజరై మాట్లాడుతూ మెపా ఎజెండా అయిన విద్యా, ఉపాధి, ఉద్యోగ, సాధికారత లక్ష్యంగానే ముందుకు సాగుతున్నామని అన్నారు. ఆ దిశగానే ఈ ఏడాది 10వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కార్యాచరణ చేశామన్నారు. అందులో భా గంగానే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో విస్తృత పరిచయాలు ఉన్న న ర్సింహుల రాకేష్‌ను మెపారాష్ట్ర ప్లేస్ మెంట్సెల్ కన్వీనర్‌గా నియమించినట్లు తెలిపారు. మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ2022-23 సంవత్సరాన్ని మెపా ఉ ద్యోగనామ సంవత్సరంగా తన ఎజెండా ప్రకటించి ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రప్రథమంగా సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా విజయ వంతంను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రమంతటా జాబ్ మేళాలకు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెపా ప్లేస్‌మెంట్‌సెల్ కన్వీనర్ నర్సింహుల రాకేష్, డాక్టర్ కట్ల శ్రీనివాస్, బాలబోయిన రమాదేవి, పిల్లి సునీల్‌కుమార్, ఉడుత మహేందర్,బోనాల రమేష్, పోలు పరమేశ్వర్, కౌటం రమేష్, తక్కెళ్ల నరేష్, భూమా భిక్షపతి,తాళ్ల రవి,నిమ్మల ప్రశాంత్,జీవన్, స్వామి ముదిరాజ్ ,జాబ్ ఆస్పిరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.