Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్నోవేషన్ చాలెంజ్‌లో ఐదు రకాల పరికరాల తయారీ
- విద్యార్థులకు పార్టిసిపేషన్ పత్రాల అందజేత
నవతెలంగాణ-శాయంపేట
తోటి పిల్లలతో కలిసి ఆడుతూ, పాడుతూ చదు వుతూ అల్లరిగా తిరిగే వయసులోనే సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో వారి మేధస్సుకు పదు నుపెట్టారు. సమాజంలో జరుగుతున్న పరిణామాల ను నిశితంగా పరిశీలించి అందరికీ అనుకూలంగా ఉండేలా కిట్స్ తయారు చేసి అందర్నీ అబ్బురపరిచా రు. తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఆన్లైన్ ప్రోగ్రాంలో శాయంపేట ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలో చదువుతున్న 20 మంది విద్యార్థులు పాల్గొని 5 ప్రాజెక్టులు తయారుచేసి పార్టిసిపేషన్ పత్రాలను అందుకున్నారు. శాయంపేట జెడ్ పి ఎస్ ఎస్ పాఠ శాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల హెచ్ ఎం వెంకటేశ్వరరావు, సైన్స్మాస్టర్ సత్య ప్రసాద్ తె లంగాణ రాష్ట్ర స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ గురించి వివరించారు. నలుగురు విద్యార్థులు ఒక టీంగా ఏర్పడి ఏదైనా ప్రాజెక్టు తయారు చేయాలని ఆదేశించారు.
మల్టీపర్పస్ చైర్
పాఠశాలలో 8వతరగతి చదువుతున్న రంగు సంజరు, తోటి మిత్రులు గొట్టిముక్కల సాయికృష్ణ, వల్పదాస్ సాత్విక్, మామిడి దీక్షిత్ సాయితో కలిసి వృ ద్ధాప్యంలో వృద్ధులు పడుతున్న ఇబ్బం దులను గుర్తిం చి మల్టీపర్పస్ చైర్‌కు శ్రీకారం చుట్టారు. ఈ కుర్చీ లోనే రెండుడ్రాలు పెట్టడం వల్ల అందులో మెడిసిన్స్ ఉంచుకోవడానికి, వాటర్ బాటిల్ స్టాండ్, హైడ్రాలిక్ తో రెస్ట్సీటు, ఆక్సిజన్ స్టాండ్, కాళ్లకు విశ్రాంతి తీసు కోవడానికి పెడల్స్, భోజనం చే యడానికి టేబుల్ మే ట్, ఒకేకుర్చీలో సమకూర్చారు. చైర్ మువ్ కావడానికి కాళ్లకింద గ్రిల్స్ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వృ ద్ధులు ఎలాంటి అవస్థలు పడ కుండా మల్టీపర్పస్ కుర్చీలోనే అన్ని వసతులు కల్పిస్తూ తయారు చేశారు.
ఫ్రిక్షన్ మోటార్ ఎలక్ట్రిక్ వాహనం
8వ తరగతి చదువుతున్న బాసాని విగేష్ తోటి విద్యార్థులు దాసరి జగదీష్, బండారి ఫణీంద్ర, వల్ప దాస్ వర్షిత్ సహాయంతో ఫిక్షన్ మోటార్ ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపకల్పన చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం పెరగడం, వాహ నాలు వెళ్తున్నప్పుడు బ్యాటరీ చార్జింగ్ పడిపోతే వాహ నం ఆగిపోవడం జరుగుతుందని, దీనిని గుర్తించి వా హనం నడుస్తున్నప్పుడే ఆటోమెటిక్ రీఛార్జ్ అయ్యేలా, స్పీడ్ పెరిగేలా, కిలోమీటర్ల దూరం ఎక్కువ వచ్చేలా వాహనాన్ని రూపకల్పన చేసినట్లు విగేష్ తెలిపారు.
పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైర్
పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఎస్. వంశీ తోటి విద్యార్థులు సాయిచరణ్, ప్రశాంత్, చరణ్ లతో కలిసి పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ పరికరాన్ని రూపకల్పన చేశారు. ఈ పరికరాన్ని పాకెట్లో వేసుకుని ఎక్కడికైనా తీసుకువెళ్లచ్చని, దీని ద్వారా నీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీటిని తాగవచ్చని తెలిపారు. లిస్పీకింగ్ డ్రాలి పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి ఎన్. ధనుష్ తోటి విద్యార్థులు చరణ్, హర్షిత్, నిఖిల్ తో కలిసి స్పీకింగ్ డ్రా పరికరానికి రూపకల్పన చేశారు. అందత్వం కలి గిన వికలాంగులు వారికి కండ్లు కనిపించక ఒకరిపై ఆధారపడాల్సి వస్తుందని, వారు రోజు వారి వేసుకునే మెడిసిన్స్ వారు వేసుకునేలా ఈ పరికరం ఉపయోగ పడుతుందని తెలిపారు. ఒక టేబుల్లో డ్రాలు ఏర్పా టు చేస్తామని, దానికి సెన్సార్ స్పీకర్ ఏర్పాటు చేయ డం వల్ల మెడిసిన్స్ కోసం డ్రా తెరిచినప్పుడు ఒక్కొక్క డ్రా తెరిచినప్పుడు ఉదయం డ్రా ఉదయం అని, ఏ సమయానికి ఆ సమయం స్పష్టంగా తెలియజేస్తుంద న్నారు. వికలాంగులకు ఇబ్బందులు ఉండవన్నారు.
ఆయుర్వేదిక ఔషధ మూలికలు
పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అరుణ్ కుమార్ తోటి విద్యార్థులు శశివరుణ్, ఋషి కుమార్, అమరేందర్‌తో కలిసి ఆయుర్వేద ఔషధ మూలికలను తయారు చేశారు. ప్రకతిలో మొలిచిన నల్లాల ఆకుపై పరిశోధనలు చేసి గాయాలు మానడానికి ఏ విధంగా వినియోగించాలో ప్రాజెక్టు తయారు చేశారు. ఈ ప్రా జెక్టులను ఆన్లైన్లో ఇన్నోవేషన్ ఛాలెంజ్ కు పంపిం చగా 20 మంది విద్యార్థులకు పార్టిసిపేషన్ పత్రాల ను అందివ్వగా, హెచ్ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఎంసి చైర్మన్ అబ్దుల్లా, సైన్స్ మాస్టర్ సత్యప్రసాద్, ఉపాధ్యా యులు విద్యార్థులకు అందజేసి అభినందించారు. వి ద్యార్థులు తయారుచేసిన కిట్స్ రాష్ట్రస్థాయిలో కూడా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ పాఠశా ల విద్యార్థులు అసమాన్య ప్రతిభతో సమాజంలో జ రుగుతున్న పరిణామాలను అవగతం చేసుకొని సొం త మేథస్సుతో కిట్స్తయారు చే యడం అభినందనీ యమని హెచ్ఎం వెంకటేశ్వర్రావు తెలిపారు.