Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిటిఎఫ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి టి టి లింగారెడ్డి
నవతెలంగాణ-పర్వతగిరి
పోరాటాల ఫలితంగానే పదోన్నతులు,బదిలీల షెడ్యూల విడుదల జరిగిందని డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.టి.లింగారెడ్డి అన్నారు.మండల కేంద్రం లోని జెడ్పీ హెచ్ఎస్ పర్వతగిరి పాఠశాలలో శనివారం ఆ సంఘం సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ స మస్యల పరిష్కారమే లక్ష్యంగా డిటిఎఫ్ పనిచేస్తుందని అన్నారు.317 జీవో వల్ల కలిగే నష్టాలు గూర్చి ఆవేదన చెందారు.ఉపాధ్యాయులందరికీ జీరో సర్వీసు కల్పి స్తూ బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించినట్లయితే ఎలాంటి సమస్యలు రాకపోయేవని అన్నారు. బదిలీల కన్నా పదోన్నతులు ముఖ్యమని ఒక ఎస్జీటీ ఉపాధ్యాయులు ఎ స్జీటీలుగానే పదవి విరమణ పొందుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఏకీకృత సర్వీస్ నిబంధనల కొరకు ప్రభుత్వం చొరవ చూపీ కేసును విరమింపజేసి సమస్య కు పరిష్కారం చూపించినట్లయితే అనేక మంది ఉపాధ్యాయులకు న్యా యం జ రుగుతుందని తెలిపారు. దంపతులిద్దరూ పనిచేసే ప్రాంతాలు, పనిచేసే దగ్గరలో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వ కల్పించిన వెసులుబాటును కొందరు పక్కదారి పట్టి స్తున్నారని వారన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైనది కాబట్టి ఈ బదిలీలు పదోన్నతులు ఆగవని వారు తెలి పారు. రాష్ట్రంలో పాఠశాలల పర్యవేక్షాధికారుల కొరత ఉందని వారిని ఈ పదోన్నతులలోనే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం మండలం లోని కల్లేడ కు చెందిన డిటిఎఫ్ సీనియర్ సభ్యులు తక్కల్లపల్లి సూరయ్య తల్లి ఇటీవల మృతిచెందగా బాధితుని ఇంటికి వెళ్లి కుటుం బానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిలర్ ఉప్పలయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు గోవిందరావు,జిల్లా కా ర్యదర్శి మహంకాళి రామస్వామి, మండల ప్రధాన కార్యదర్శ కందకట్ల రమేష్, సీనియర్ సభ్యులు చంద్రమౌళి,బసికే రాజు,కంప్యూటర్ ఆపరేటర్ జయరాజ్, తదితరులు పాల్గొన్నారు.