Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రానున్న ఎన్నికల్లో అధర్మారెడ్డికి గుణపాఠం తప్పదు : ఇంచార్జి ఇనుగాల
- కాంగ్రెస్తోనే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు : మాజీ ఎంపీ రాజయ్య
- పరకాలలో హాత్ సే హత్ జోడో యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-ఆత్మకూర్
రాష్ట్రాన్ని రాబందుల్లా పిక్కతింటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెడితేనే తెలంగాణ రాష్ట్రానికి వి ముక్తి లభిస్తుంది.రాష్ట్రంలో సంక్షేమ పాలన రావా లంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రె స్పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంక ట్రాంరెడ్డి పిలుపునిచ్చారు.శనివారం హన్మకొండ నుండి నేరుగా ఆత్మకూర్ మండలం అగ్రంపహాడ్ స మ్మక్క-సారలమ్మలకు దేవతలకు ప్రత్యేక పూజలు ని ర్వహించి ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు కటాక్షపూర్ గ్రామం నుండి హాత్ సే హాత్ జోడో అభియాన్ యా త్ర ప్రారంభించారు. ఇంచార్జ్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాజీఎంపీ సిరిసిల్ల రాజ య్య గడప గడపకు తిరు గుతూ వరంగల్ డిక్లరేషన్ వివరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇనగాల మాట్లాడుతూ పరకాల ఎ మ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కాంట్రాక్టులపై ఉన్న ప్రేమ అభివద్ధిపై లేదని బినామీలతో ప్రభుత్వ భూములను, గుట్టాలను కొల్లగొడుతు నాణ్యత లేని పనులతో అధి కారులను భయభ్రాంతులకు చేస్తూ కోట్లాదిరూపా యల ప్రజల సొమ్మును దోచుకుంటున్న అధర్మారెడ్డికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించా రు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ సంక్షేమ పాలన కాంగ్రెస్తోనే సాధ్యమని రైతులకు 2 లక్షల రుణమాఫీ, విద్యార్దులకు ఫీజురీయింబర్స్ మెంట్ నిరుపేదలకు ఆరోగ్యశ్రీపథకం, నిరుపేదలం దరికి అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందాలంటే రా ష్ట్రంలో కేసిఆర్పాలన అంతమై కాంగ్రెస్ పార్టీ అధికా రం లో కి రావాలని రాజయ్య పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో టి ఆర్ఎస్ నాయకులు ఇచ్చే డబ్బులు చూసి మోసపోకుండా నిఖార్సుగా నిలబడి మాట్లాడి నప్పుడే కేసిఆర్ దుర్మార్గపు పాలన అంతమవుతుం దని.అందుకోసం ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికు లై పోరాడాలని రాజయ్య పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షు లు కమలాపురం రమేష్, జిల్లా నాయకులు పర్వతగిరి రాజు, ఎంపీపీ సౌజన్య,ఓబీసీ జిల్లా కోఆర్డినేటర్ చిమ్మని దేవరాజు,గీసుగొండ అధ్యక్షులు శ్రీనివాస్, ప రకాల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జి ల్లా అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్య క్షులు భీరం రజనీకర్ రెడ్డి,చౌళ్లపెల్లి సర్పంచ్ కంచ ర వికుమార్,ఓబీసీ నియోజకవర్గ కోఆర్డినేటర్ భయ్యా తిరుపతి, బోరిగం స్వామి, ముద్దం సాంబయ్య, కృష్ణ, మాదాసి ఏలీయా,తనుగుల సందీప్,రుద్ర ప్రసాద్ ఉడుత రాజేందర్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మణి కంఠ, మండలాల, గ్రామ శాఖల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.