Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎస్సీ కమిటీ హాల్ వద్ద ఉనికిచెర్ల, దేవనూరు, ధర్మసాగర్ గ్రామాల ప్రధాన కూడలిలలో మధ్యగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ అడ్డుగా ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దానిని తొలగించాలని స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు విద్యుత్ అధికారులను దాదాపు రెండు సం వత్సరాల పూర్వమే అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ స్థానిక ఏఇ బాస్కే సుధాకర్ ట్రాన్స్ఫార్మర్ మార్చాలంటే తగిన ఖర్చులు అవుతాయని, వాటిని చెల్లిస్తే మేము మార్చడం జరుగుతుందని,పూటకో మాట చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.ఇందుకు సంబంధించిన స్థానికులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు ఉపయోగకరమైన పనికి స్థానిక ఏఈకి వినతిపత్రం ఇవ్వగా వినతి పత్రంలో ట్రాన్స్ఫార్మర్ కు అయ్యే ఖర్చులు భరిస్తేనే అది మార్చడం జరుగుతుందని,మరీ రాయించుకోవడం వారి పనుల అలసత్వానికి నిదర్శనంగా చెప్పకనే చెప్పవచ్చు.ఈ విషయంపై ఉన్నతాధికారుల దష్టికి ప్రజలు ప్రజాప్రతినిధులు తీసుకెళ్లగా ఉన్నత విద్యుత్ అధికారులు అది ప్రజలకు ఇబ్బందిగా ఉండడంవల్ల ఎలాంటి ఖర్చులు లేకుండా ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు చర్యలు చేప డతామని హామీ ఇచ్చారు. దీంతో ఏ ఈ ట్రాన్స్ఫార్మర్లు అమ ర్చేందుకు ఉన్నతాధికారులు చూపెట్టిన స్థలంలో గద్దెలు ని ర్మించి నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్న ట్రాన్స్ఫార్మర్లు షి ఫ్ట్ చేయకపోవడం వారి పనితనానికి నిలువెత్తు నిదర్శనం. నాటిన పోళ్లను సైతం తీసుకెళ్లడం చాలా విడ్డూరమని స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు.
విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అధికారులు : కొట్టే చార్లెస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి
విద్యుత్ అధికారులకు ప్రధాన కూడళ్లలోని ట్రాన్స్ఫార్మర్ షిఫ్ట్ చే యాలని 2001 నుండి వినతులు సమర్పించిన చేయడం లేదు. ట్రాన్స్ ఫార్మర్ షిఫ్టింగ్ గద్దెలు కట్టించే ముం దు ఎలాంటి పైసలు అడగలేదు. గ ద్దెలను ఏర్పాటు చేసిన తర్వాత డబ్బులు చెల్లిస్తేనే ట్రాన్స్ఫార్మర్మార్చడం జరుగుతుందని చెప్పడం సరికాదు.
స్థానిక ఏ ఈ బస్కే సుధాకర్ ను ఈ విషయాలపై వివరణ కోరగా వారు ట్రాన్స్ఫార్మర్ మార్చా లని ఒకరు, మార్చకూడదని మరికొందరు అంటున్నారని, అది ఇది చేయాలనే ఉద్దేశంతో ఆపడం జరుగుతుంది. ఇందుకు కొంచెం ప్రాబ్లం వచ్చిందని,స్థానిక నాయకులు కొందరు దీని పౖ ఎస్ఈకి ఫిర్యాదు చేశారని, దీంతో దేవనూర్ లైన్ కు షిఫ్ట్ చేయాలని, ఫీల్డ్అబ్జెక్షన్ రావడం వల్ల ఆపడం జరిగింది. ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగిందని. నాకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారి మాటల్లో తెలియజేశారు.