Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోజు హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియో జకవర్గంలోని 9 వ డివిజన్లో అమత టాకీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ చేసి పాద యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల చార్జ్ షీట్ ను, మరియు రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటిం టికి తిరుగుతూ కరపత్రాల రూపంలో చేర వేయడం జరిగిం ది. కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసు కోవడం జరిగింది.అమత టాకీస్ దగ్గర ఉన్న 20 ఫీట్ల వెడల్పు ఉన్న పెద్ద మోరికి పై కప్పు లేక జనావాసాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలు స్కూల్ కు వెళ్ళే క్రమమంలో మోరిలో పడే ప్రమాదం ఉందని, ఇదివరకు రెండు మూడు పర్యాయాలు ఇలా జరిగిందిందని కాలనివాసులు పేర్కొనడం జరిగింది.నాల పక్కకు జానావా సాలు ఉండటం వలన మురుగు నీరు రావడంతో పిల్లలు వ ద్ధులు అనారోగ్యం బారిన పడుతుతున్నరని తమ గోడును వెలిబుచ్చడం జరిగింది.సైడ్ డ్రైనేజీ సరిగా లేక మురుగు కాలు వలు వ్యర్థ పదా ర్థాలతో నిండాయ ని మరుగు నీరు నిలిచి కాలనీ పరిసరాల్లో భ రించలేని దుర్గంధం వస్తుందని అన్నారు. స్వచ్ఛ భారత్ అని ప్రచారం ఒకటే ప్రచా రం చేస్తున్నారు . మే ము తిరిగిన కాలనీల్లో ఎక్కడి చెత్త అక్కేడే ఉందని పది పదిహేను రోజుల నుండి చెత్త తీసుకుపోవడం లేదని దీని వలన దుర్గంధభరితమైన వాసన వస్తుందని అన్నారు. మున్సిపల్ అధికారులకు పదే పదే ఎన్ని సార్లు చెప్పిన లాభం లేదని వాపోయారు.ఈ ఎం.ఎల్.ఏ అభివద్ధి చేయకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు? గ్రేటర్ వరంగల్ వరంగల్ కార్పొరేషన్ సమస్యలపై ఎందుకు శ్రద్ధ వహించడం లేదు. ఇన్ని సంవత్సరాలు ఎం.ఎల్.ఏ గా ఉండి ఏమి చేసారో ఒక సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు మహమ్మద్ జాఫర్, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, సంపత్, సతీష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.