Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాల్మీకి బోయల జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ
నవతెలంగాణ-హనుమకొండ
తెలంగాణ రాష్ట్రంలోనే వాల్మీకి బోయలను గిరిజన తెగ లు ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ సభలో ఏ కగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టినందున శనివారం హన్మ కొండ బాలాసముద్రం లోని ప్రెస్ క్లబ్ లో వాల్మీకి బోయల ఉమ్మడి వరంగల్ జిల్లా ఐక్య కార్యచరణ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి బోయలను గిరిజన తెగలు ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలం గాణ అసెంబ్లీ సభలో ఏకగ్రీవంగా తీర్మానం ప్రవేశపెట్టి నందుకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీల ను నెరవేర్చిన బంగారు తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్ రావుకి మా ఉమ్మడి వరంగల్ జిల్లా వాల్మీకి బోయ జాతి తరపున హదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. వాల్మీకి జాతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్కి ఎల్లవేళలా ఋణపడి ఉంటుందని అన్నారు. అదేవి ధంగా మాకు వెన్నంటి ఉండి మా చిరకాల వాంఛమైన పున రుద్ధరణను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్ళి, బిల్లును ప్రవేశపెట్టుటకు సహకరించిన మహబూబ్ నగర్ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్ర బెల్లి దయా కర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మా జాతి ఆప్తులు మాకు భరోసాగా నిలచి నమ్మకంగా ఉండడని ధైర్యమందించిన మా రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినో ద్కుమార్కు మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఐక్య కార్యచరణ కమిటీ తరపున ముకుళిత హస్తములతో అభినందలు తెలియజేస్తున్నాము. ఆలింగే ఈ బహత్తర కార్యక్రమంలో తమవంతు సహకారమందించిన ఉమ్మడి వరంగల్ జిల్లా శాసనసభ్యులు,రాష్ట్ర చీఫ్ విప్,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినరు భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్,పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్న పనేని నరేందర్, ఉమ్మడి మహబూబ్ నగర్ శాసన సభ్యులు బండ్ల కష్ణమోహన్ రెడ్డి,అబ్రహం లకు పేరు పేరు న హదయపూర్వక కతజ్ఞతలు తెలిపారు.