Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాత్ సే హాత్ జోడోయాత్రతో రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్
- టీపీసీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
హాత్ సే హాత్ జోడోయాత్రతో టిపిసిసి అధ్యక్షు డు రేవంత్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు చేస్తున్నారని టీపీ సీసీ సభ్యుడు లకావత్ లక్ష్మీనారాయణ విమర్శించా రు. ఇల్లందులో రేవంత్రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్రకు వెళ్తున్న సందర్భంగా మండలంలోని చింత లపల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జక్కుల రాంరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాకు ప్రాతినిత్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అవినీతి, అక్రమా లను రేవంత్ రెడ్డి బయట పెడతారనే భయంతోనే వి మర్శలు చేస్తున్నారని, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షు డిగా ఉన్న రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఎర్రబెల్లి 2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఇప్పటివరకు 650 ఎకరాల భూమిని అక్రమంగా ఆర్జించాడని,ఆ ఆస్తు లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. తొర్రూరు మండలంలోని 200 ఎకరాల భూమి కబ్జా చేశారని, ఆ భూముల చుట్టూ రోడ్లు వేయించుకున్నారని ఆరోపించారు. డివిజన్ కేంద్రంలోని అన్నారం రోడ్డు లో ఉన్న దేవదాయ భూమిని ఆక్రమించాలని బిఆర్ ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని వాపోయా రు. మంత్రి ఎర్రబెల్లి అండదండతో బిఆర్ఎస్ నాయ కులు జోరుగా ఇసుక దందాలకు పాల్పడుతున్నారని, మున్సిపాలిటీ పరిధిలోని అక్రమాలకు పాల్పడుతు న్నారని అన్నారు. నై తెలంగాణ అని చెప్పిన దయా కర్రావుకు మంత్రిపదవి చేపట్టే అర్హత లేదన్నారు. ధరణి పేరుతో భూములను కబ్జా చేసుకుంటున్నా రని, పాలకుర్తిలో ఏ ఒక్క గిరిజనునికి ఒక్క బెడ్ రూ మ్ ఇచ్చిన దాఖలాలు లేవని,రాబోయే ఎన్నికల్లో డ బ్బుతో ఓటును దండుకునే ప్రయత్నాలు చేస్తున్నా డని, బిఆర్ఎస్ పతనం పాలకుర్తి నుంచి ప్రారంభమవుతుందన్నారు. దయాకర్ రావు నోటు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని పాలకుర్తిలో ప్రమాణం చేసి ఎన్నికల్లో రావాలని అన్నారు. త్వరలో రేవంత్ రెడ్డి యాత్ర పాలకుర్తి నియోజకవర్గంలో ఉండబోతుందన్నారు.
రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్రకు అశేషప్రజాదరణ ఉందని, ఊరూరా పార్టీ కార్యకర్తలు చైతన్యంతో ముందుకు వస్తున్నారని తెలిపారు. ఎర్రబెల్లి లాంటి ఎంతమంది నాయకులు విమర్శించిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎదురు ఉండదని స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివద్ధిలో వెనుకబడేయాలని చూస్తున్న ఎర్రబెల్లికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.
ఈ సమావేశంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్యా నాయక్, రాయపర్తి, దేవరుప్పుల మండలాల అధ్యక్షులు మాచర్ల ప్రభాకర్, పెద్ది కష్ణమూర్తి గౌడ్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపా ధ్యక్షులు కందాడి అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మేకల కుమార్,సుంచు సంతోష్, దుంపల కుమారస్వామి, దీకొండ మధు గౌడ్, కర్ర అశోక్ రెడ్డి, మొగుళ్ళ లింగన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.