Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మహబూబాబాద్
ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ విమర్శించారు. శనివారం సిపిఎం మహబూబాబాద్ రూరల్ మండల పార్టీ సమావేశం చేపూరి గణేష్ అధ్యక్షతననిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కూలీల కు కొనుగోలు శక్తి పెరగడానికి దోహదపడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు, ప్రభుత్వం పనుల ను పనుల డిమాండ్‌ను తగ్గించి చూపుతూ నిధుల కేటాయింపు పట్ల పక్షవాతం వహిస్తుందని ఆరోపించారు దేశవ్యాప్తంగా ఇప్పటికీ రెండు కోట్ల మంది గ్రామీణ పేదలు ఉపాధి హామీ పని కోసం దరఖాస్తులు చేసుకోగా పని డిమాండ్ లేదన్న పేరుతో దొంగ లెక్కలు చూపెడుతుందని విమర్శించారు.పనుల కేటాయింపులను తగ్గించి ఈ పథకాన్ని రూపుమాపే ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రోజువారి ఉపాధి కూలీ గిట్టుబాటు కాక పేదలు ఉపాధి పనుల పట్ల నిరాకాష్టతో ఉంటున్నారని చేసిన పనికి నెలలతరబడి కూలి డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా మెటీరియ ల్ కాంపోనెంట్ పెంచడం వల్ల కేటాయించిన డబ్బుల్లో ఎక్కువ భాగం కాంట్రాక్టర్ల కే దక్కుతుందని వారన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుందని ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితంగా వచ్చిన ఈ చట్టాన్ని కాపాడుకోవడానికి మరో ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశం లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గునిగంటి రాజన్న, మండల పార్టీ కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి, జిల్లా నాయకులు కుర్ర మహేష్, చేపూరి గణేష్, నాగేల్లి సురేష్, ఇస్లావత్ జోగయ్య నాయక్, ధరావత్ బాలు, డి బ్రహ్మం, సుధాకర్, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.