Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్య మంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని సర్పంచ్ ఈదునూరి రమాదేవి నర్సింహారెడ్డి అన్నారు.మండల కేంద్రానికి చెందిన నడిదే చంద్రారెడ్డి తండ్రి సంజీవ రెడ్డి కిసీఎం సహాయనిధి నుండి విడుదలైన1,96,000 రూపా యల చెక్కును మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, స్థానిక నాయకులతో కలిసి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తోటకూరి రేణుక కిష్టయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు లోడం గి వెంకటేశ్వర్లు,వార్డు సభ్యులు ఆకుల వెంకన్న, వరికుప్పల మల్లయ్య, నాయకులు ఆకుల మల్లయ్య, రెడ్డిరాజుల అబ్బసాయిలు, రెడ్డిరాజుల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.