Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమ తులు లేకుండా అక్రమంగా తాడిచెర్ల ఆర్అండ్ఆర్ సైట్కు మట్టి తరలిస్తున్న టిఎస్ 02 యుబి 4778 అనే నెంబర్ గల టిప్పర్ ఢకొీని బాణాల రమేష్ (45) అనే వ్యక్తి మతి చెందిన సంఘటన మండల కేంద్ర మైన తాడిచెర్లలో తెల్లవారుజామున చోటుచేసు కుం ది. స్థానికుల, కొయ్యుర్ పోలీసులు పూర్తి కథనం బా ణాల రమేష్ తోపాటు పలువురు ఓ పెళ్లి డిజెలో డా న్సు చేస్తున్న క్రమంలో అటువైపు మట్టిలోడ్ తో వ స్తున్న టిప్పర్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు ఢకొీట్ట డంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలి పారు. మతుని కుటుంబానికి న్యాయం చేయాలం టూ ప్రధాన రహదారిపై కుటుంబ సభ్యులు, గ్రామ స్తులు, పలు పార్టీల నాయకులు ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు బైఠాయించి ఆందోళన,నిరసన కార్య క్రమాలు చేపట్టారు.బాధిత కుటుంబాన్ని గుత్తేదారు ఆర్థికంగా ఆదుకోవాలని స్థానిక ఎంపిటిసి సభ్యురా లు రావుల కల్పన మొగిలి, భూపాలపల్లి జిల్లా కాం గ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్, పీఏసీఎస్ చైర్మన్ ప్రకాష్ రావు, వార్డు సభ్యుడు బండి స్వామి, బిఆర్ఎస్ పార్టీ మండల అధికారప్రతినిది బండి రా జయ్య సంగిభావం ప్రక టించి ఆందోళన ఉదతం చేశారు.అక్రమంగా మట్టి తరలిస్తున్న గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా ఒక నిండుప్రాణం పోయిందని వాపోయారు.
సంఘటన స్థలం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం నుంచి సాయం త్రం వరకు కాటారం ఎస్ఐ శ్రీనివాస్, కొయ్యుర్ ఏఎస్ఐ కుమార స్వామి సిబ్బందితో భారీ బందోవస్తు నిర్వహించారు.బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామనడంతో ఆందోళన విరమించారు. మతుని భార్య బాణాల దేవక్క పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.