Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
నవతెలంగాణ-మహాదేవపూర్
ఉన్నత చదువులు చదివిన యువత నిరుద్యోగ సమస్య నిర్మూలన వైపు మొగ్గు చూపాలని బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కార్యకర్త పిలుపు మేరకు పలిమెల మండలం బూర్గుగూడెంలోమినిస్ట్రీ ఆఫ్ ఐటీ ఆధ్వర్యంలోశనివారం డిజిటల్ విలేజ్‌లో భా గంగా ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ ప్రా రంభించిన మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూ కర్, జిల్లా యువనాయకులు జక్కు రాకేష్ ఈ కార్యక్ర మంలో రెండు మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షు లు లింగంపల్లి శ్రీనివాసరావు, జవాల్లింగంపల్లి శ్రీని వాసరావు, జవాజి తిరుపతి, రండు మండలాల టిఆ ర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసం దర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ మారు మూల గ్రా మాలను డిజిట ల్ విలేజ్‌గా ఏర్పాటు చేయ డం ద్వారా పేద ప్రజలకు అనేక విధాలుగా ప్రయోజ నం చేకూరు తుందన్నారు. గ్రామాల్లోని ప్రజలకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా సీఎస్సీ కేంద్రాలు ఎం తో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇంటి దగ్గరే ఆర్థిక లావాదేవిలు, రెవెన్యూ పరమైన అంశాలు, బ్యాంకు అకౌంట్లు, ఇతరత్రా సేవలను ఈ కేంద్రాల ద్వారా వినియోగించుకోవచ్చన్నారు. అ యితే గ్రామాల్లోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా వంద డిజిటల్ విలేజ్‌లుగా మార్చేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఐటీ శ్రీకారం చుట్టిందని, అందులో నియోజక వర్గంలోని బూర్గుగూడెం ఎంపిక అయిందన్నారు. మన ఊరికి చెందిన సర్వేష్ అనే యువకుడు వివిధ సేవలు అందిస్తాడని తెలిపారు. గ్రామాల్లోని నిరుపే దలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ విలే జ్ ద్వారా అనేక ఉపయోగాలుంటాయన్నారు. అదే విధంగా గ్రాడ్యువేషన్ చేసిన యువకులు సైతం ఇలాంటి ఉపాది మార్గాలను ఎంచుకుని ప్రజలకు సేవలు అందించే దిశగా అడుగులు వేయాలన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామమైన పలి మెల మండలం బూర్గు గూడెంకు ఒకప్పుడు రావా లంటే ఎంతో కష్టపడేవారని, ఎలాంటి సౌక ర్యాలు లేకుండా ఉండేదన్నారు.ప్రత్యేక తెలంగాణ రా ష్ట్ర ఏ ర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం బూర్గు గూడెం కు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఈనాడు క్షణాల్లోమండల కేంద్రాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సౌకర్యాలున్నాయని, అలాగే కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీఆప్ ఐటీలో ఈ గ్రామం సెలక్ట్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భూపాలపల్లి జిల్లాలో వంద డిజిటల్ విలేజ్లను త్వరగా ఏర్పాటు చేసి దేశంలో ఆదర్శంగా నిలుపాలని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ను ఆయన కోరారు. నియోజకవర్గంలో మరిన్ని గ్రామాలను డిజిటల్ విలేజ్‌లుగా ఎంపిక చేసి సీఎస్సీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని పేదవర్గాలకు పెద్ద ఎత్తున ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అందిపుచ్చుకునే అంశంలో తమవంతు పూర్తి సహకారం ఉంటుందని, సీఎస్సీ కేంద్రం ఏర్పాటు చేసిన సర్వేష్ ఈ ప్రాంతంలోని నిరుపేదలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తూ ఆర్థికంగా అభివద్ది చెందాలని ఆయన ఆకాంక్షించారు.