Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-మల్హర్రావు
జర్నలిస్టులకు 2013లో ఇచ్చిన ఇంటి స్థలాలను ప్రభుత్వం పరిరక్షించాలని మాజీమంత్రి, మం థని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు జర్నలిస్టుల తరుపున డిమాండ్ చేశారు. శనివారం జరిగిన అసెం బ్లీ సమావేశాల్లో మాట్లాడారు భూ పాలపల్లి జిల్లా కేంద్రములో 2013 అప్పటి ప్రభుత్వం దాదాపు 40 మంది జర్న లిస్టులకు ఇంటి స్థలాలను ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ జిల్లాల పునర్వి భజన భాగంలో జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మిస్తున్న నేప థ్యంలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు వేయడం ఇబ్బందిగా ఉందని కలెక్టర్ జర్నలిస్టుల ఇంటిస్థలాలను క్యాన్సల్ చేస్తున్నట్లుగా నోటీస్ ఆర్డర్ ఇవ్వడం సరికా దని ప్రశ్నించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల ఇంటి స్థలాలను పరిర క్షించాలని అసెంబ్లీలో కోరారు.ఇందుకు జర్నలిస్టులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృ తజ్ఞతలు తెలిపారు.