Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
గాడిదకు రంగు పూసి ఆవు అని మోసం చేసే నాయకుడు కేసీఆర్ అనీ వైయస్ షర్మిల అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో చౌరస్తాలో ప్రజా ప్రస్థానం యాత్ర సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ తన కుటుంబం బాగుపడేలా లక్షల కోట్లు వెనుక వేసుకున్నారని ఆన్నారు. బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణలో బార్లను, బెల్డ్ షాపులకు తెరచి ప్రజలను మద్యపాన వ్యసనాలుగా తయారు చేశాడన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి పాలన కొనసాగించాలంటే తమను అధికారంలోకి దీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కోఆర్డినేటర్ వెంకటరెడ్డి, చేవెళ్ల స్వామి బొడ్డు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.