Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కురవి
మండల కేంద్రం కురవిలో అపూ ర్వ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 1976-77, సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థినీ, విద్యార్థులు అందరూ హాజరై ఆనాటి తమ గురువులు నరసింహారావు, ధర్మారెడ్డి, మల్లారెడ్డి, సత్యనా రాయణలను సన్మానించి గురువులతో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకు న్నారు. ఆనాటి పూర్వ విద్యార్థి నేటి తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు నల్లపు సుధాకర్ మాట్లాడుతూ ఆనాడు ఎటువంటి సౌకర్యం లేకున్నప్పటికీ తామందరం వివిధ గ్రామాల నుండి నడుచుకుంటూ దాదాపు 10 కిలోమీటర్లు దూరం నుండి వచ్చి ఎంతో సంతోషంగా చదువుకునేవారమని, ఈ పాఠశాల ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనమైన చరిత్ర ఉందని, తాము చదువుకున్నప్పటి భవన సముదాయం నేడు శిథిలా వస్థకు చేరడం ఎంతో బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కురవి సర్పంచ్ నూతక్కి పద్మనరసింహారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తరఫున మన ఊరు-మనబడి కార్యక్రమం కింద ఈ పాఠశాల భవనానికి మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అప్పటి పూర్వ విద్యార్థులు సత్యనారాయణ, నాగేశ్వరరావు, వెంకట్ రెడ్డి, పుప్పాల బిక్షం తదితరులు పాల్గొన్నారు.