Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరుప్పుల
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పని ఒత్తిడి తగ్గించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఆదివారం సాయంత్రానికి పాదయాత్ర మండలంలోని ధర్మపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా థాన్ నాయ క్ స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పాలకుర్తి నుంచే ప్రారంభించడం జరిగిం దన్నారు.ఈ సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాదయాత్ర బందంతో పాటు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపర్తి రాజు,అధ్యక్షుడు బత్తిని వెంకన్న,మండల అధ్య క్షుడు బస్వ రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.