Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు
నవతెలంగాణ-పాలకుర్తి
ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమే శ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో చండిక అమ్మవారి విగ్రహ ప్రతి ష్టాపన కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన అంకురార్పణ కార్య క్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంప తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఈనెల 16 వరకు జరిగే చండిక అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాలను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో ఆలయ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, పాలకుర్తి సర్పంచు వీరమనేని యాకాంతరావు, జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కో ఆప్షన్ సభ్యు లు ఎండి మదర్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి సర్వర్ ఖాన్, తొర్రూర్ సొసైటీ చైర్మన్ గోనె మైసిరెడ్డి, ఆలయ ఈవో నండూరి రజిని కుమారులతో పాటు ఆలయ పాలకమండలి సభ్యులు నరసింహారెడ్డి, వేణుగోపాల్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.