Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహిళల పసుపు కుంకుమలకు ఆరాధ్య దైవం గా పాడిపంటలు పుష్కలంగా ఉండాలని ప్రజల సుభిక్షంగా వెలసిల్లాలని మానుకోటలో నెలకొల్పిన బొడ్రాయి పోతరాజు విగ్రహాల వద్ద ఆదివారం తిరు గు వారం సందర్భంగా బిఆర్ఎస్ మానుకోట జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత బోనం ఎత్తుకు న్నారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈనెల 5వ తేదీన ప్రతిష్టించిన బొడ్రాయి పోతరా జులకు తిరుగువారం పండుగ చేశారు. తిరుగువారం పండుగను పురస్కరించుకొని కవిత బోనం చెల్లించా రు. మానుకోట జిల్లా ప్రజలు సుభిక్షంగా సుఖసంతో షాలతో వెలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్ర మంలో బిఆర్ఎస్ నాయకులు లిపర్కాల శ్రీనివాస్ రెడ్డి,ముత్యం వెంకన్న గౌడ్, డోలి సత్యనారాయణ, బోడ పథ్వీరాజ్, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా ,నిమ్మల శ్రీనివాస్, దాసరి రవిష్, కర్పూరపు గోపి,పిల్లి సుధాకర్ గంగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
బోడ్రాయి పతిష్ట పూజలో ఎంపి కవిత
కేసముద్రం రూరల్ : కేసముద్రం మండలంలో ని కోరుకొండపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్య క్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి 50,001/- రూపాయలు విరాళం మహబూబాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ పార్ల మెంట్ సభ్యురాలు మాలోత్ కవిత అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి శ్రీరామ్ రెడ్డి, మహబూబా బాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, యసాని చెన్న మల్లారెడ్డి,బాలాజీ రెడ్డిఉప్పల్ రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు, పర్కాల శ్రీనివాస్ రెడ్డి,మర్రి నారాయణ రావు, మర్రి రంగ రావు, ముత్యం వెంకన్న గౌడ్జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా,దామరకొండ ప్రవీణ్మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి,సట్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.