Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
మండలం అభివృద్ధి చెందాలంటే అధికారులు పాలకులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పాలకులు రోజు హితబోధ చేస్తున్న ప్పటికీ బచ్చన్నపేట మండలం మాత్రం అందుకు విభిన్నంగా తయారయిందనే చెప్పవచ్చు. అందుకు ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశమే సాక్షిగా నిలి చింది. వివరాలలోకి వెళితే మండల కేంద్రంలో ఆదివారం సర్వసభ్య సమావేశం ఎంపీపీ భావనల నాగజ్యోతి కృష్ణంరాజు అధ్యక్షతన నిర్వహించారు. 11 గంటల కు జరగాల్సిన సమావేశంకు ఇటు అధికారులు గానీ అటు పాలకులు కానీ ఎవరు హాజరు కాకపోవడంతో గంట ఆలస్యంతో సమావేశం ప్రారంభించినప్పటికీ అప్పటికి కూడా ఎవరు రాకపోవడం శోచనీయం. చీర 12 గంటల 30 నిమి షాలకు ఒకరిద్దరు అధికారులు ఒకరిద్దరు పాలకులు హాజరు కావడంతో సమా వేశం ప్రారంభమైన అరగంట తర్వాత కొంతమంది సర్పంచులు హాజరు అయ్యా రు. పంచాయతీ పరిధిలో గ్రామాలలో చేపట్టిన పనులకు బిల్లులు వస్తలేవని తాము అప్పుల పలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు సమావేశంను బహిష్కరించి వెళ్లిపో యారు. తమకు బిల్లులు రాకపోవడానికి ఎంపీపీ, ఇంచార్జ్ ఎంపీడీవోల నిర్లక్ష్యమే నని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సమావేశానికి పూర్తిస్థాయి లో అధికారులు సైతం హాజరు కాకపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిం చారు. దీనితో ఇక్కడున్న పాలకులకు మండల అభివృద్ధిపై కాకుండా తమ జేబు లను నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో రఘురామకృష్ణ, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, సర్పంచులు నరెడ్ల బాల్రెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి, మాస పేట రవీందర్ రెడ్డి, సుంకే లక్ష్మి, ఏలూరి మాధవి, అధికారులు సిద్ధార్థ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.