Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని కోట్యానాయక్ తండా పంచాయతీ పరిధిలోని ముత్తితండాలో గత మూడు వారాల నుండి కొన్ని చోట్ల వీధి లైట్లు వెలగక పోవడంతో గిరిజన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా రు.గ్రామంలో ఉన్న పలు విధులతో పా టు, తండాకు వెళ్ళే ప్రధాన రోడ్డు మా ర్గంలో వీధి లైట్లు లేనప్పటికీ పంచాయతీ అధికారులు,సర్పంచ్ పట్టించుకోకపోవ డం గమనార్హం. పంచాయతీ మొత్తంగా కేవలం రెండు గ్రామాలు మాత్రమే ఉన్న ప్పటికీ పూర్తి స్దాయిలో వీధి లైట్లు వెలగటం లేదు. అనేక సార్లు సర్పంచ్‌కు, అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడం లేదని తండా వాసులు ఆరోపిస్తు న్నారు.ప్రతి నెల నెల పంచాయతీలో విధి లైట్ల ఏర్పాటు కు, విద్యుత్ బిల్లులకు, పంచాయతీ పరిపాలనా వ్యవహారాలకు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నప్పటికి కనీసం వీధి లైట్లు పూర్తి స్దాయిలో ఏర్పాటు చేయకపోవడం శోచనీ యం అని పాలకులు, అధికారుల పని తీరుకు అద్దం పడుతుంది. వీధిలైట్లు వెలగటం లేదని ఇటివల పత్రికలో వచ్చిన సంబంధిత అధికారులు వీధి లైట్లు ఏర్పాటు చేయడం లేదంటే పంచాయతీ పాలనపై వారికి ఉన్న శ్రద్ధ ఎంటో అర్థం అవుతుందని గిరిజనులు మండిపడుతున్నారు.మారుమూల గిరిజన తండా లో గల్లి, గల్లిలు, ఇరుకుగా అసౌకర్యంగా ఉన్న రోడ్లపై రాత్రి సమయాల్లో పిల్లలు, వద్ధులు నడవడానికి పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. తండాలో వెలగని వీధి లైట్లు తీరు ఇలా ఉంటే... వెలుగుతున్న కొన్ని వీధి లైట్లు పగలు వరకు వెలుగు తూనే ఉంటాయి. వీధి లైట్లు అటు రాత్రులు వెలగవు. వెలిగిన వీధి లైట్లు పగలు అర్పరు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల పాలన తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వీధిలైట్లు పూర్తి స్దాయిలో ఏర్పాటు చేయాలని, వెలుగుతున్న వీధి లైట్లను సకాలంలో అప్ చేసి పంచాయతీ నుండి నెల నెల చెల్లి స్తున్న విద్యుత్ బిల్లును ఆదా చేసేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతు న్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి వెంకటేష్‌ను వివరణ కోరగాఫోన్ స్వీచ్ ఆప్ వచ్చింది.