Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
నవతెలంగాణ-మల్హర్రావు/మహాదేవపూర్
రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలలో బానిసలాగా చూస్తోందని, రాష్ట్రంలో బీసీ జనాభా 56% ఉన్నది జనాభా ఆధారంగా 20 వేల కోట్లు పెట్టాలని మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడటంపై బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం కొయ్యుర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలే ఖరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ అధ్యక్షులు రా జ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఎన్నోసార్లు బీసీ సంక్షేమ శాఖ ఆర్థికశాఖ మంత్రిని కలిసి బీసీ కులాల సమస్యలు వారి స్థితి గతులు వివరించి, వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినా అమలు కాలేదన్నారు. యాదవులకు గొర్లు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు సొసైటీకి చాలామంది దరఖాస్తు పెట్టుకుని, డీడీలు కట్టి ఎదురు చూస్తున్నారని, వారిక అన్యాయం చేశారని అన్నారు. బీసీ ఫెడరేషన్లకు వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ అమలు చేయ లేదన్నారు. రాష్ట్రంలో బీసీ నిరుపేద కుటుంబాలు అనేకం ఉన్నాయని ఎంబిసి చైర్మన్ ఏర్పాటుచేసి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్న హామీ విస్మరంచారన్నారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణులకు రూ.250 కోట్లు కేటాయిస్తామని చెప్పి కేటాయించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చేతివృత్తులు, బీసీ కులస్తులందరికీ బీసీబంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా వైద్య విద్య పరంగా రిజ ర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలన్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపులతోపాటు గౌడ్స్, జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లిలో గళమెత్తన శ్రీధర్‌బాబుకు తెలంగాణ జాతీయ బీసీ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సఘాల నాయకులు విజయగిరి సమ్మయ్య, అక్కల బాపు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.