Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నడికూడ
మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఆదివారం తల్లి ఇద్దరు కొడుకులను బావిలోకి నెట్టి తను కూడా దూకి ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బావిలో నుండి పిల్లల అరుపులు విన బడడంతో పెద్ద కుమారుడు మోటార్ పైపును పట్టుకొని ఉం డగా అతన్ని స్థానికులు కాపాడారు. తల్లి చిన్న కుమారుడు నీటిలో మునగడంతో వారిద్దరు మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు కంటత్మకూరు గ్రామానికి చెందిన మామిడి కావ్య 30 ఆమె భర్త కుమారస్వామి డ్రైవర్ వీరికి ఇద్దరు కుమారులు ఒకరు(9), ఒకరు(7) ఉన్నారు. కావ్య తల్లిదండ్రులతో భర్త కుమారస్వామి వేములవాడ తీర్థయాత్రకు వెళ్లడంతో ఎవరు లేని సమయంలో ఇంట్లో వారితో చిన్నచిన్న తగాదాలతో క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను బావిలో తోసి కావ్య కూడా బావిలో దూకినట్లు తెలిపారు. స్థానికులు పోలీసులకు సమా చారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు చేసి పూర్తి వివ రాలు తెలియజేస్తామని పరకాల ఏసీపీ శివరామయ్య, దామెర ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.