Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
గ్రామపంచాయతీ కార్మికులకు మున్సిపల్ కార్మికుల వలే జీఓ-60 ప్రకారం వేతనాలు పెంచా లని, ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పాలకుర్తి నుండి హైదరాబాద్ పట్నం వరకు పంచాయతీ కార్మికుల పాదయాత్ర ఆదివారం పాలకుర్తి లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రారంభించారు. పాదయాత్ర కు సంఘీభావంగా మండలం లోని అలుబాక నుండి వెంకటాపురం వరకు సంఘీభావ పాదయాత్ర ను సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రారం భించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీన పాలకుర్తి నుండి 17 రోజులపాటు 300 కిలోమీటర్లు నాలుగు జిల్లాల్లో యాత్ర కొనసాగుతూ చివరి రోజైనా ఫిబ్రవరి 28న ఇందిరా పార్క్ వద్దకు చేరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం చే స్తుందనిఅన్నారు. అన్ని రకాల ఉద్యోగులకు, ఇతర కార్మికులకు వేతనాలు పెంచి గ్రామ పంచాయతీ కార్మికులకు పెంచలేదని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 5 లక్షలా ఇన్సూరెన్స్ అందించాలని అన్నారు. జీఓ -51 సవరించి మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దుచేసి కేటగిరీల వారిగానే పనులు చే యించాలన్నారు. జీఓ-60 ప్రకారం పారిశుద్య కార్మికులకు రూ.15,600 వేతనం చెల్లించాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముగింపు రోజు ఇంది రాపార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఉంటుందని, అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోతే కార్మికులు మరో సమ్మె పోరాటానికి కూడా సిద్ధమవుతారని తెలిపారు. పాదయాత్ర కు రైతు సంఘం జిల్లా నాయకులు వంక రాములు, తోట నాగేశ్వర్ రావు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కట్ల నర్సింహా చారీ, పోషాలు, యూనియన్ మండల అధ్యక్షులు ఎనమళ్ళ రంజిత్,మండల కార్యదర్శి జనగాం శ్రీను, ఉపాధ్యక్షులు రాంప్రసాద్,కార్మికులు అనూష, సావిత్రి,టి శ్రీనివాస్, టి నరేష్, రాజశేఖర్, విష్ణు,సమ్మయ్య,సందీప్, అంజిబాబు, సూర్యం ,శ్రీకాంత్, 70మంది కార్మికులు పాల్గొన్నారు.