Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓసిటీలో మూడురోజులు కేసీఆర్ జన్మదిన వేడుకలు
నవతెలంగాణ-కాశిబుగ్గ
ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రా ష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచి దేశం లోనే ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దారని వరం గల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.సీఎంకేసీఆర్జన్మదినం సందర్భం గా ఈనెల15,16,17తేదీల్లో ఆజం జాహి మిల్ గ్రౌండ్ (ఓసిటీ)లో వేడుకలు నిర్వహిస్తుండగా సోమవారం ఎమ్మెల్యే నరేందర్ ఏర్పాట్లను పరిశీ లించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే నరేందర్ మా ట్లా డుతూ కెసి ఆర్ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విజన్ ను డిస్ప్లే చేయనున్నట్లు తెలిపారు. ఫోటో ఎగ్జిబి షన్, సాంస్కృతి కార్యక్రమాలు మూడురోజులపాటు ఉంటాయన్నారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతి థులుగా మంత్రులు హరీష్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు హాజరవుతున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈనెల 18న మహాశివరాత్రి సందర్భంగా ఇదే ప్రాంతంలో శివపార్వతుల కళ్యాణం, మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రిస్టియన్ కాలనీ, గిరి ప్రసాద్ నగర్ లలో బస్తీ దావఖానాలను మంత్రి హరీష్రావు ప్రారంభిస్తారని తెలిపారు. ఆజం జాహి మిల్ గ్రౌండ్ లో త్వరలోనే నూతన వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు, మూడు రోజులపాటు జరిగే కెసిఆర్ జన్మదిన వేడుకలతో పాటు మహాశివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు భారీ ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వ రంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి కుమారస్వామి, కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.