Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
ప్రతిఒక్కరూ వృథా ఖర్చులు తగ్గించుకొని, పొదుపు చే సుకోని ఆర్థికంగా బలోపేతంగా ఉండడం ఎంతో ముఖ్యమ ని జిల్లాకలెక్టర్ డాక్టర్బి.గోపి తెలిపారు. సోమవారం కలెక్టరే ట్లో ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు 2023ను లీడ్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2.కి.మీ వాకెథాన్ నిర్వహించారు. కలెక్టరెట్ నుండి ఏకాశీల పార్క్ వరకు జరిగిన ఈ వాక్ థన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్బీఐ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ఈనెల 13 నుంచి 1 7వ తేదీ వరకు జిల్లాలోని అన్నిబ్యాంకుల ద్వారా, ఆర్థిక అక్షరా స్యత క్యాంపులు వివిధ గ్రామపంచాయతీ మున్సిపల్ ప్రాంతా ల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మనం బ్యాంకుద్వారా రు ణాలను నిమిషాల వ్యవధిలో పొందవచ్చునని, సైబర్ నేరగా ళ్ళ నుంచి మనం తప్పించుకోవాలంటే మనం బ్యాంకు ఓటీపీ లు ఇతర లింకులు ఫ్రీగా వచ్చే డబ్బులకు ఆశపడ కుండా ఎవ రితో చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్థిక మోసాలకు గురైన వారు 1930, 14448 టోల్ ఫ్రీ నెంబర్ లకు ఫోన్ చేసి తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం రాజు, యుబిఐ డిప్యూటీ ఆర్ఎం వజీర్ సుల్తాన్, కెనరా బ్యాంక్ ఆర్ఎం మాధవి, శ్రీనివాస్ , డిసిసిబి ఏజీఎం రాజశేఖర్, సిబిఐ ఐఓబి, ఏపీజీవీబీ, ఎస్బీఐ వివిధ బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ హాల్లో ప్రజావాణి కార్యక్రమం లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి 63 దరఖాస్తుల స్వీకరించడం జరిగిందని, అవి శాఖలవారిగా దరఖాస్తుల వివరాలు తెలియ పరచడం అయి నదని ఆయన అన్నారు. భూమికి సంబంధించిన సమస్యలు 18, ఎడ్యుకేషన్ 3, ఎంజీఎం 7, ఎస్సీ కార్పొరేషన్ 9, జిడబ్ల్యు ఎంసీ 2, పోలీస్ కమిషనర్ 1, ఆర్డీవో నర్సంపేట 3, విద్యుత్ 1, ఏడి సర్వే 2, ఇరిగేషన్ 1, ఆర్డీవో వరంగల్ 5, ఎంపీడీవో 2, ఈసెక్షన్స్ సూపరిండెంట్ 8, డిడబ్ల్యుఓ 1 చొప్పుల విభా గాల వారిగా దరఖాస్తులువచ్చాయన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజావాణిలో అనేక సమస్యలపై ప్రజలు అందించిన దరఖా స్తులను వేగంగా పరిష్కరించి లబ్ధిదారులకు న్యాయం చేయా లని చెప్పారు.