Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ
నవతెలంగాణ-కాజీపేట
కార్మికులపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని వీడి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని సౌత్‌సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షులు కల్వ శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలోని అన్నిరాష్ట్రాల కేంద్ర కార్మికులు ఎన్పీఎస్ను వ్యతిరేకిస్తూ ఓపిఎస్అమలు చేయాలని ఏఐఆర్ ఎఫ్, సౌత్‌సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఇచ్చిన పిలు పుమేరకు కాజీపేట ఎలక్ట్రికల్ లోకోషెడ్‌లో బ్రాంచ్ సెక్రటరీ నాయిని సదానందం ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సే కరణ కార్యక్రమం నిర్వహించగా ముఖ్యఅతిథిగా జొనల్ అ ధ్యక్షులు కామ్రేడ్ కాల్వ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలలో ఎన్‌పి ఎస్‌కు వ్యతిరేకంగా ఓపిఎస్ అమలుపరచాలని లేని పక్షం లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడైన కార్మిక హక్కులను సాధించుకుంటామని, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరా టం చేయడానికి కార్మికులందరూ ఏకం కావాలన్నారు. అ నంతరం కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సంతకాల సేక రణ చేసి నిరసన తెలిపారు. ఈకార్యక్రమంలో బ్రాంచ్ కార్య వర్గం, యూత్ కమిటీ, కార్మికులు పాల్గొన్నారు.