Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండ్ర ఎల్లయ్య
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఓ భూమిలో కూలి పనికి వచ్చి పనులు నిర్వహిస్తున్న క్రమంలో కొంతమంది వచ్చి కారంచల్లి కొట్టి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండ్ర ఎల్లయ్య తెలిపారు. మండల కేంద్రంలో ఆయన సోమవారం విలేకరుల సమావే శాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో రైతు భూమి ఒక ఎకరం అయినా సర్వేనెంబర్ 287 బై బి బై టు బై వన్ బై వన్ లో రైతు భూమి ఉండగా అతను మమ్ములను సుమారు 50 మందిని కూలికి పనిచేయడానికి పిలిచాడని అందులో పని చేస్తున్న క్రమంలో నాపై కొంతమంది వచ్చి కారం చల్లి రాళ్లతో కట్టడంతో దళిత గిరిజన పేద కుటుంబాలకు చెందిన ఇద్దరికీ దెబ్బలు తగిలాయని మాపై ఆక్రమంగా కూలి పనికి వచ్చిన వారిపై కొట్టడం తిట్టడం సరైనది కాదని అన్నారు. అలాంటి వ్యక్తులపై విచారణ జరిపించి న్యాయం చేయాలన్నారు. వాళ్ళ భూమి అయితే రెవిన్యూలో అధికారులతో కలిసి విచారణ జరిపించుకోవాలని తెలిపారు. ఈ భూమిపై నాకు అన్ని ఆధారాలు ఉన్నాయని అయినప్పటికీ అనవసరంగా మాతో లొల్లి జరపడం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, జయరాజు, సతీష్‌తోపాటు కొంత మంది కూలీలు ఉన్నారు.