Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రజలే నా ప్రాణం... ప్రజలే నా దేవుళ్ళు... నా గుండెలో ప్రాణం ఉన్నంతవరకు పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. సోమవా రం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబానికి చెక్కును అందించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకు లు, ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమ స్యలు పట్టించుకున్న పాపాన ఏనాడు పోలేదని నేను ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుండి 24 గంటల ప్రజల మధ్యలో ఉంటూ నియోజకవర్గం నడిబొడ్డున ఉంటూ ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రజల సమస్యల సమస్యల భావించి ప్రతి ఒక్కరికి అండగా ఉంటానన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకొని రామన్నగూడనికి చెందిన పాశం యాకయ్య మృతి చెందగా వారి భార్య ఆశం విజయకు, నాగారం గ్రామానికి చెందిన చిరబోయిన ఉప్పలయ్య మృతి చెందగా వారి భార్య రామతారకు పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ చెక్కు రెండు లక్షల రూపాయల చెక్కుల ను అందించారు. మండలంలోని మాజీ సర్పంచ్ ధాన్యానాయక్ ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబా న్ని పరామర్శించారు. ఆ కుటుంబాన్ని అన్ని రంగాలు గా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకా లను కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. విలేక రులకు సంబంధించిన స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధిత తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ యోగేశ్వరతో మాట్లాడినని త్వరలోనే మీకు స్థలాన్ని మంజూరు చేయిస్తానని తెలిపారు.
దాడులు చేసుకుంటే సహించేది లేదు
ఒకరి భూమి పైకి మరొకరు అన్యాయంగా దౌర్జ న్యం చేసి పోకూడదని ఏదైనా శాంతియుతంగా మా ట్లాడుకోవాలని తెలిపారు. అలా కాకుండా దౌర్జన్యం చేస్తే ఊరుకోమని తెలిపారు. న్యాయమైన లబ్ధిదారు లకు న్యాయం జరిగే విధంగా అధికారులు కృషి చేస్తా రని తెలిపారు. నియోజకవర్గంలో భూ పంపకంలో అన్నదమ్ముల తగాదాలు తప్ప దౌర్జన్యంతో ఒకరు భూమి ఒకరు ఆక్రమంగా చేసుకున్న దాఖలు లేవని వాళ్ళ చేస్తే మేము కూడా ఊరుకోమని అర్హులకు న్యా యం జరిగేటట్లుగా పార్టీ అండగా ఉంటదని తెలిపా రు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకటరెడ్డి, వర్కింగ్ మండల ప్రెసిడెంట్ రమేష్, మండల ఉపాధ్యక్షుడు పూలి రామచంద్రు, రైతు సమన్వయ సమితి జిల్లా మండల కోఆర్డినేటర్లు బాలాజీ నాయక్, కాసం వెంకటేశ్వర్ రెడ్డి, తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ వయసు చైర్మన్ కసరబోయిన విజరు యాదవ్, సర్పంచు కొమ్మ అనిల్,గ్రామ శాఖ అధ్యక్షుడు పాశం రమేష్, ఆదిరెడ్డి చింతకుంట్ల యాకయ్య, బొల్లు మురళి, జల సోమయ్య, వినోద్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.