Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఎండి సలీమా అధ్యక్షతన సిఐటియు మండల కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమా వేశానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో గతంలో పరిపాలించిన పాలకులు ప్రజలకు అన్యా యం చేశారని చెప్పుకుంటూ మేము అధికారంలోకి వస్తే కార్మికుల, ప్రజల,ఉద్యోగుల,పేద ప్రజల పక్షాన నిలబడి అందరికీ సాయం చేస్తామని వారిని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు అన్యా యం చేకూర్చే విధంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.కార్మికులను కట్టుబానిసలుగా మార్చే నాలు గు లేబర్ కోడులను రద్దు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరుకులపై ఏ విధంగా ధరలు మోపుతున్నారో, అదేవిధంగా కార్మికులు జీవించడా నికి రోజువారి, నెలవారీ, కూలీ, వేతనాలు కూడా అంతే రీతిలో పెంచాలన్నారు. కనీస వేతనం నెలకు రూ.26వేల రూపాయలు ఇవ్వాలని అత్యున్నత న్యా యస్థానం చెప్పిన వేతనాలను అమలు చేయకుండా పెడచెవునా పెడుతూ, రాజకీయ నాయకుల వేతనా లు మాత్రం ఇష్టం వచ్చిన రీతిగా పెంచుకున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిత్యవసర సరుకులపై ధరలు తగ్గించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయా లని కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు,ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై2023 ఏప్రిల్ 05న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా సిఐటియు కేసముద్రం మండల నిర్మాణ బాధ్యులు సమ్మెట రాజమౌళి మాట్లాడుతూ పోరాటా లు కార్మికుల హక్కు అని పోరాటాల ద్వారానే సమ స్యలు పరిష్కారం అవుతాయన్నారు. అంగన్వాడీల స మస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రేపు(మంగళవారం) రోజున జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అంగన్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ చింత మౌనిక, సిఐటి యు మండల కార్యదర్శి జల్లే జయరాజ్ మండల కమిటీ సభ్యులు,ఎం.రజిని, బి.నిర్మల,బి.కవిత ,ఎంవి రమణ,ఎన్.జ్యోతి, జె.లలిత,జి.రాజమణి,ఎస్.వెంక టరమణ, ఎం.విజయ,జాటోత్ మంగీలాల్, ఏ.సురే ష్, మట్టి కృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.