Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఆధాని కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి మోడీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీపీఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్ర సాద్ డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ వరంగల్ మండల సమితి ఆధ్వర్యం లో జేపీఎన్రోడ్లోని ఎస్ బీఐ బ్యాంకు ముందు ధ ర్నా నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి ముఖ్యఅతిథి గా హాజరైన ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ రంగం లోని ప్రజాధనాన్ని రూ.10 లక్షల కోట్లకు పైగా అక్ర మంగా దోచుకున్న గౌతం ఆధానిని మోడీ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.పార్లమెంట్లో ప్రతి ప క్షాలు ముక్తకంఠంతోకుంభకోణంపై విచారణ జరిపిం చాలని కోరుతున్నా ఏమాత్రం స్పందించకుండా మో డీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, మోడీ ప్రజలకు స మాధానం చెప్పకుండా మౌనం వహించడం వెనుక ఆధానిని రక్షించాలనే ఆలోచన ఉన్నట్లు అనుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ఆధాని అంబానీలాంటి బడా పెట్టుబడిదారులకు అప్పగిం చాలనే కుట్రలను మానుకోవాలని లేదంటే ప్రజల చేతిలో మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హె చ్చరించారు. ఇప్పటికైనా వెంటనే ఆధాని మోసంవల్ల నష్టపోయిన ఎల్ఐసి, బ్యాంకులకు చెందిన వేలకోట్ల డబ్బులను రాబట్టాలని , భవిష్యత్లో ఇలాంటి కుం కుంభకోణాలకు పాల్పడకుండా ఆదానిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ వరంగల్ మండల నా యకులు సండ్ర కుమార్, జన్ను రవి, పరికిరాల రమే ష్, లావుడ్యాదస్రునాయక్, భూజుగుండ్ల రమేష్, మం ద ఐలయ్య, మస్కా సుధీర్, వలబోజు వెంకన్న, బచ్చ లస్వప్న, సుప్రియ, అంజాద్, మేదరి అశోక్ తదిత రులు పాల్గొన్నారు.