Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజావాణికి గైర్హాజరైన ముఖ్య అధికారులు
- నిరాశతో వెనుదిరిగిన ఫిర్యాదుదారులు
- పదిసార్లు వచ్చినా పరిష్కారం దొరకలేదని ఆవేదన
నవతెలంగాణ-వరంగల్
బల్దియాలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమానికి పలువురు ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన అధికారులతోపాటు కమీషనర్ హాజ రు కాకపోవడంతో ఫిర్యాదుదారులు తీవ్ర విచారంతో తిరిగివెళ్ళిపోయారు. కమిషనర్ మాటను కింది స్థా యి అధికారులు బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఒక్కొక బాధితుడు తమ సమస్య పరి ష్కారం కోసం మూడు నుండి పదిసార్లు ప్రజావాణికి వచ్చినా సమస్యమాత్రం పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ఉ న్నతాధికారులు ప్రత్యేకచర్యలు చేపట్టి ఫిర్యాదు దారు ల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
60 వినతులు ...
బల్దియా ప్రధాన కా ర్యాలయంలోని సమా వేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించా రు. బల్దియాకు చెందిన పలువిభాగాల ఉన్నతాది óకా రులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నేటి ప్ర జావాణికి ఇంజనీరింగ్ విభాగం 6, టౌన్ ప్లానింగ్ వి భాగం 37, పన్నుల విభాగం 6, ప్రజారోగ్య, శానిటేష న్ విభాగం 8, నీటి సరఫరా విభాగం 3, మొత్తం 60 ఫిర్యాదులను స్వీకరించారు. దివ్యాంగుల సంఘ స భ్యులకు పబ్లిక్టాయిలెట్ మెయింటెయిన్ చేయడాని కి ఇవ్వాలని, 44వ డివిజన్ కడిపికొండ బొడ్రాయి నుండి శివాలయం వరకు రోడ్డు వెడల్పు చేయాలని, 14వ డివిజన్ మధురకాలనీలో సీసీ రోడ్డు, డ్రైనేజ్ ని ర్మాణం చేయాలనే వినతులను పలువురు కాలనీ ప్రజ లు అందజేశారు.
ఈ ప్రజావాణిలో అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, సిహెచ్ఓ శ్రీనివాసరావు, డిప్యూటీ కమీషన ర్లు అనిసూర్ రషీద్, జోనా, బయలజిస్ట్ మాధవరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.