Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు
నవతెలంగాణ-మట్టెవాడ
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అన్నారు. సోమవారం రత్న హోటల్లో వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ తూర్పు జర్నలిస్టులకి కొంతదూరం అయినప్పటికీ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటానన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జర్నలిస్టుల కోసం ఇప్పుడు కూరగాయల మార్కెట్దగ్గర ఉన్న తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం భవనాన్ని ఇక్కడి జర్నలిస్టులు అడిగిన వెంటనే తాను ఎమ్మెల్సీగా, సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న ప్పుడు కట్టించి తూర్పు జర్నలిస్టులకు గుర్తింపు తీసుకొచ్చాననే విషయాన్ని గుర్తు చేశారు. తూర్పు జర్నలిస్టు భవనంలో వర్కింగ్ జర్నలిస్టులు క్రియాశీలకంగా ఐ క్యంగా ఉంటూ తూర్పు జర్నలిస్టుల సంఘాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆత్మీయ సమావేశంలో జర్నలిస్టులు తన దృష్టికి తీసుకువచ్చిన స మస్యల్లో బాగంగా జర్నలిస్టులందరి కోసం మరో భవనాన్ని నిర్మించడంతోపాటు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం సాయిబాబా సాక్షిగా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తానని హా మీ ఇచ్చారు. ఇచ్చినమాట విషయంలో వెనుకకు తగ్గనన్న విషయం ప్రతీ పా త్రికే య మిత్రులకు తెలుసునని అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు తమకు సహకరించా లని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, సదయ్య, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, వరంగల్ ఈస్ట్ పరపతి సంఘం అధ్యక్షులు కోరుకొప్పుల నరేందర్, వరంగల్ ఈస్ట్ జర్నలిస్టుల సంక్షేమసంఘం అధ్యక్షులు జక్కుల విజయ్, ప్రధాన కార్యదర్శి రాజేం ద్రప్రసాద్, ఐజేయు రాష్ట్ర నాయకులు గాడేపల్లి మధు, గుల్షన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి సదానందం తదితరులు పాల్గొన్నారు.