Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్రావు
నవతెలంగాణ-పర్వతగిరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ అం దించాలని, ఏసీడీ చార్జీలు ఎత్తివేయాలని వర్ధన్నపేట ఏడీఏ కార్యాలయం ఎదుట సోమవారం కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా,రాస్తారోకో నిర్వహించారు. అనం తరం కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్రావు పాల్గొని మాట్లా డుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో ఆందోళన కార్యక్రమాలు నిర్ నేపథ్యం లో నిర్వ హిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తు న్నామని చెప్తున్నారని, రైతుప్రభుత్వం అని గొప్పలు చెప్పడానికే తప్ప ఎక్కడ కరెం ట్ సరఫరా అవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పంట చేతికందే స మయం ఆసన్నమైందని, రైతుల నోట్లో మట్టికొట్టవద్దన్నారు. ఇప్పటికైనా వ్యవసా యానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో అరగంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.