Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
సమాజ హితానికి బావి వైద్యుల బోధనకు ఉపయోగకరంగా ఉండేందుకు కాకతీయ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులకు తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండ్రెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ నివాసి డాక్టర్ కందుల శోభారాణి మతదేహాన్ని సోమవారం అప్పగిం చారు. అనారోగ్య రీత్యా చనిపోయిన ఆమె మృతదేహాన్ని భర్త కందుల రమేష్ సమాజ హితం కోసం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాస్ అనాటమీ ప్రొఫెసర్ ప్రసూనలకు అందజేశారు.ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సి పాల్ మోహన్‌దాస్ మాట్లాడుతూ వైద్యవృత్తిలో ఉండి ప్రజలకు సేవలు అందిం చిన శోభారాణి పార్థివదేహం వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు అందించడం అభినందనీయమనిఅన్నారు. కేయూ జ్యోతిరావుపూలే అధ్యయనకేంద్రం డైరె క్టర్‌గా శోభారాణి అందించిన సేవలు అపూర్వమని సాహిత్య ఉద్య మకారిని, మా నవతావాది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శంకర్రావుయాదవ్, ఉపేం దర్‌రెడ్డి, రాజ్‌కుమార్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.