Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) ఎన్నిక
నవతెలంగాణ- ములుగు
ములుగు జిల్లా కేంద్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. టీఎస్ సీపీఎస్ఈయు జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీటీయూ జిల్లా అధ్యక్షులు సర్వర్ అహ్మద్, ఎస్టీయు జిల్లా అధ్యక్షులు ఏళ్ళ మధు సూదన్, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుల్ల గట్టు సంజీవ, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు మడుగురి నాగేశ్వరరావు, ఆదివాసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు మంకిడి రవి, నాలుగవ తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు కిర్మాణి తదితర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హాజరై ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పై ఉద్యోగులు అంతా ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) గా ఏర్ప డాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన సీపీఎస్ రద్దు, పీఆర్సీ కమిటీ ఏర్పాటు, మధ్యంతర భృతి, పెండింగ్ డీఏల విడుదల తదితర అంశాల పై విస్తృత చర్చ జరిపారు. అనంతరం 15న ములుగు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ)గా ఏర్పాటు కాబోతున్నాయని టిటియు జిల్లా అధ్యక్షులు సర్వర్ అహ్మద్,ఎస్టీయు జిల్లా అధ్యక్షులు ఏళ్ళ మధు సూదన్, టిఎస్ సిపిఎస్ఈయు జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ , తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టిఈఏ) జిల్లా అధ్యక్షులు గుల్ల గట్టు సంజీవ, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు మడుగురి నాగేశ్వరరావు, ఆదివాసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు మంకిడి రవి, నాలుగవ తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు కిర్మాణి తెలిపారు. ములుగు జిల్లాలోని ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హాజరవ్వాలని కోరారు.