Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ చాడ రఘునాథరెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మండలంలోని జంగేడు గ్రామంలో జరిగింది. బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశానికి పట్టణ అధ్యక్షుడు సామల మధుసూదన్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరుకల గణపతితో కలిసి రఘునాథరెడ్డి హాజరై మాట్లాడారు. కంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలతోనే అభివద్ధి తెలంగాణ సాధిస్తుందన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని బీఆర్ఎస్ను రానున్న రోజుల్లో బొంద పెట్టడం ఖాయ మని హెచ్చరించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం ఉచితంగా ప్రజలకు అంది స్తామని అన్నారు. ఎరుకల గణపతి మాట్లాడుతూ సింగరేణి నిధులు భూపాలపల్లి ప్రాంతం అభివద్ధి కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు దొంగల రాజేందర్, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు వేశాల సత్యవతి, జంగేడు శక్తి కేంద్రంజంగేడు శక్తి కేంద్ర ఇంచార్జి దొంగల కుమార్, శక్తి కేంద్రం ఇంచార్జి జోగుల కుమార్, సురేష్, కడారి మలాతి ,అజ్మీర సునీత, రాజు , కుమార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.