Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాత్రి అయితే చాలు దందా..
- పట్టించుకోని అధికారులు !
నవతెలంగాణ-మల్హర్రావు
మండలం తాడిచెర్లలో ఆర్ అండ్ ఆర్ సైట్ డెవలప్ మెంట్ కోసం ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలను అతిక్ర మించారు. ఎలాంటి అనుమ తులు లేకుండా రాత్రి అయితే చాలు దర్జాగా ఎర్ర మొరం, ఇసుక తరలించి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు న్నారు. తాడిచెర్ల ఓసీపీ బ్లాక్-1 ప్రాజెక్టు ముంపునకు గురైన కాపురం భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం టీఎస్ జెన్కో అధికారులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ముందు స్థలా న్ని కేటాయించారు. నిర్వాసితుల ఇండ్ల నిర్మాణం కోసం ఆర్ అండ్ ఆర్ సైట్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సదుపా యం, తాగునీరు ఇతర సౌకర్యాలతో మోడల్ కాలనీగా తీర్చిదిద్దడానికి జిల్లా యంత్రాంగం టెండర్ ద్వారా కాంట్రా క్టర్లకు పనులు అప్పగించింది. అయితే కాంట్రాక్టర్ రెవెన్యూ, మైనింగ్ అధి కారుల నుంచి అనుమతి పొంది ఇసుక, ఎర్ర మొరం తరలించాలి. కానీ నిబం ధనలను అతిక్రమించి ఎలాంటి అను మతులు లేకుండా యథేచ్ఛగా రాత్రికి రాత్రే మానేరు నది నుంచి ఇసుక, 915 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమి నుంచి ఎర్ర మొరం తరలిస్తూ ప్రభుత్వ ఆదా యానికి భారీ గండి కొట్టారు. ఆర్ అండ్ ఆర్ సైట్లో తిరుపతి కన్స్ట్రక్షన్ పేరు మీద రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు, రూ.90 లక్షలతో సీసీ డ్రైనేజీ, రూ.75 లక్షలతో అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు
అక్రమంగా తరలించిన
ఎర్రమట్టి మొరం కుప్పలు
టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధన లను తుంగలో తొక్కుతున్నాడు. అక్రమంగా ఇసుక, ఎర్రమొరం తరలిస్తూ కాంక్రీట్ కట్టడాలు, రహదారుల పనులు కొనసా గిస్తున్నాడు. జిల్లా కలెక్టర్ చెప్పారని ప్రభుత్వ పనుల పేరుతో సదరు కాంట్రా క్టర్ ప్రభుత్వ భూమిలో ఎర్ర మొరం తరలింపు చేపడుతున్నాడు. రాత్రి అయితే చాలు జేసీబీలతో అక్రమంగా తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా ఎర్ర మొరం తరలిస్తున్నా సంబంధి త శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం గమ నార్హం. స్థానిక ప్రజలు ఇంటి అవస రాలకు మొరం, ఇసుక ట్రాక్టర్లతో తరలిస్తే జరి మానాలు విధించే అటవీ, రెవెన్యూ అధికారులు అక్రమంగా రాత్రి వేళ ఇసుక, మొరం తరలించే కాం ట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేం వాడకంపై టని పలువురు విమర్శిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా టిప్పర్ లో ఎర్ర మొరం తరలి స్తూ డ్రైవర్ అజాగ్రత్తతో ఢ కొట్టడంతో ఓ నిండు ప్రాణం బలైన విషయం అందరి కీ తెలిసిందే. ఎర్రమట్టి మొరం, ఇసుక తరలింపు అనుమతులపై జిల్లా కలెక్టర్ ఆరా తీసినట్లు సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా తర లించే ప్రసక్తే లేదని చూచించినట్లు తెలి సింది. కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న గుత్తేదారులకు రాజకీయ, జిల్లాస్థాయి అధికారులు పలుకుబడి ఉండడంతో స్థానిక అధికారులు సాహసించని పరిస్థితి నెలకొంది.
అనుమతులు లేవు : తహశీల్దార్
ఎర్రమట్టి మొరం, ఇసుక తర లింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వ లేదు. ప్రభుత్వ పనులకు తవ్వకాలు చేప డితే పనుల రికార్డు ప్రకారం మట్టి సెస్ మినహాయించి చెల్లింపులు ఉంటాయి. రాత్రి వేళ ఎవరైనా సరే అక్రమంగా ఎర్ర మట్టి మొరం, ఇసుక తరలిస్తే చట్టప రమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేపడితే అను మతులు పక్కాగా ఉండాలి. లేకుంటే వాహనాలు సీజ్ చేసి జరిమానా విధిస్తాం.