Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు శోభారాణి
నవతెలంగాణ - ములుగు
బాల్య వివాహాలు బాలల ఎదుగుదలకు అవరోధాలని, అక్రమ దత్తత చిన్నారుల హక్కు లను అరిస్తుందని బాలల హక్కుల కమిషన్ సభ్యు రాలు శోభారాణి తెలిపారు. జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆడిటోరియంలో మంగళవారం బాల్య వివాహాల నిషేధం 2006, అక్రమ దత్తత నిషేధ చట్టాలపై అంగన్వాడీ టీచర్లు, ఇతర లైన్ డిపార్మెంట్స్ క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో అంగన్వాడీ టీచర్లు ధైర్యం ప్రదర్శించి సైనికులా గర్భిణీలు, పిల్లలకు, బాలింతలకు సేవలు అందించారని అభినందిం చారు. బాల్య వివాహానికి గురైన బాలికలు శారీర కంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సామా జిక ఎదుగుదలలో ఆటంకాలు ఏర్పడుతున్నాయ ని అన్నారు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగుతుండటం బాధాకరం అని అన్నారు. అక్రమ దత్తత కేసులు కూడా పెరుగుతుండటం ఆలోచించాల్సిన విషయం అన్నారు. చట్టబద్దం కాని అక్రమ దత్తతను తీసుకోవడం మూలంగా ఆ దత్తత ఇవ్వబడిన పిల్లలు చట్టపరంగా వారికి రావాల్సిన హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గ్రామ స్థాయి లో సమస్యల పరిష్కారానికి గ్రామ బాలల పరి రక్షణ కమిటీలను మరింత అవగాహన పర్చాలని అన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి ఈపి ప్రేమలత మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కార్యక్రమాల గురించి వివ రించారు. బాలల సంక్షేమ సమితి చైర్మన్ వసుధ మాట్లాడుతూ జిల్లాలో పిల్లలని రెస్క్యూ చేసిన తరువాత వారిని సురక్షిత ప్రాంతంలో ఉంచ డానికి పిల్లల హౌమ్లు లేవని, దీంతో వారికి ఆశ్రయం కల్పించడానికి ఇబ్బంది కలుగుతుందని విన్నవించారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ ఆధ్వర్యంలో అక్రమ దత్తత- ప్రభావం, చట్టబద్దమైన దత్తత - ప్రయోజనాలు, దత్తత నిబంధనలు - 2022 గురించి అవగాహన కల్పించారు. ప్రొటెక్షన్ ఆఫీ సర్ హరికృష్ణ బాల్యవివాహాల నిషేధ చట్టం - 2006 పై అవగాహన కల్పించారు. సిడబ్ల్యూసి సభ్యులు మధు, ఏటూరునాగారం, తాడ్వాయి సిడిపిఓలు హేమలత, మల్లీశ్వరి, ఐసిపిఎస్ లీగల్ ఆఫీసర్ సంజీవ, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ విక్రమ్, సఖి ఇంచార్జీ కల్పన, ఐసిపిఎస్ చైల్డ్ లైన్, సఖి, బాల సదనం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.