Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి బొమ్మాపూర్ గ్రామంలో డీఎంహెచ్ఓ శ్రీరామ్, ప్రోగ్రాం అధికారిని డాక్టర్ ఉమాదేవి ఆదేశాలతో వైద్య ఆరోగ్య సిబ్బంది ఈనెల 13,14,15 తేదీల్లో మూడు రోజుల పాటు పైలే రియా వ్యాధి నివారణ సర్వే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. సర్పంచ్ ఓ డేటి పద్మ రవీందర్ రెడ్డి పాల్గొని సర్వే ప్రారభించారు. ఇంటంటి సర్వే లో వైద్య సిబ్బంది రాత్రి వేలల్లో ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహిస్తారని, రక్త నమూ నాలు సేకరిస్తారని కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి సుస్మిత, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏ స్వామి తెలిపారు. హెల్త్ అసిస్టెంట్స్ అడప రాజరమణయ్య, సత్యనారాయణ, ఏ ఎన్ఎంలు సుశీల, తిరుపతమ్మ, ఆశ వర్కర్స్ స్వప్న, శైలజ, రాధిక, యశోద, గ్రామ పంచా యతీ సిబ్బంది లలిత, రాజమ్మ, బాపు తదితరులు పాల్గొన్నారు.