Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
సీఎం కేసీఆర్ మాయమాటలు నమ్మకుండా రాబోయే ఎన్నికల్లో పిల్లల భవిష్యత్తు కోసమైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ తూర్పు నియోజక వర్గంలో కొండ సురేఖ చేపడుతున్న హాత్ సే హాత్ జూడో యాత్ర మంగళవారం 19వ డివిజన్ కాశిబుగ్గ జంక్షన్ నుండి ప్రారంభించారు. భారీ జన సందోహం మధ్య ప్రజల ను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే లాభాలనుప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో దేశంపై పడ్డారని మండిపడ్డారు. ప్రతి గడపకు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి పాలనను తెలియజేసి రాబోయే కాలంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.ఐదు వందలకే వంట గ్యాస్ ఇస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు ఉద్యోగాల ఊసే లేదని చదువుకున్న యువత కూలి పనులకు వెళ్లలేక, ఉద్యోగం లేక మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలు, అక్రమ వసూలు తప్ప నియోజకవర్గానికి చేసిన అభివద్ధి ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో రేషన్ షాపులో తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చేవారని కానీ ఇప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం తప్ప ఏమి రావడం లేదన్నారు. ఆజం జాహి మిల్లు కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని అధికారంలోకి వస్తే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తూర్పు నుండి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్గొండ రమేష్, కూరతోట సదానందం, మడిపల్లి కష్ణ, మీసాల ప్రకాష్, దాసరి రాజేష్, ఏసు, బత్తుల వినోద్, గిరిగిరి పుష్ప, శ్రీలత, వసీం, శివ, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.