Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉచిత కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-రేగొండ
అంధత్వ రహిత రాష్ట్ర లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా బాధితులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లా డుతూ మనిషికి అన్ని అవయవాల్లో ప్రధానమైనది నేత్రమే అన్నారు. అలాంటి కంటిని నిర్లక్ష్యం చేస్తున్నా మని, ప్రతి ఒక్కరు కంటి వెలుగును సద్వినియోగం చేసుకొని చికిత్స చేయించుకోవాలని సూచించారు. కంటి వెలుగులో పరీక్ష చేసి అందుబాటులో ఉన్న అద్దాలను అక్కడే పంపిణీ చేస్తారని, అవసరమైన వారికి శస్త్ర చికిత్స కోసం వరంగల్‌లోని కొన్ని ప్రైవే టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరికి కంటి వైద్యంతో పాటు, అందరికీ ఉచిత వైద్యం అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారని తెలిపారు. గతంలో మొదటి విడత అనేక మందిరికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వైద్యం అందించినట్లు గుర్తు చేశారు. రేగొండ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని రాష్ట్రంలోనే ఉన్నత వైద్య కేంద్రంగా తీర్చి దిద్దిన వైద్యులకు సిబ్బందికి అభినందనలు తెలిపారు. గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలం దరికీ అందుబాటులో వైద్యులు ఉండే విధంగా తీర్చి దిద్దుతున్నామని అన్నారు. రేగొండ మండలంలో 12 మంది పల్లె వైద్యులను నియమించినట్లు గుర్తు చేశారు. సబ్ సెంటర్ల నిర్మాణానికి నిధులు కేటాయి స్తున్నామని, ప్రతి సబ్ సెంటర్లో ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది ఉంటారని అన్నారు. మండల కేంద్రంలోని పిహెచ్సీని 24 గంటల వైద్యశాలగా ఏర్పాటు చేశా మని వైద్యులు అందుబాటులో ఉంటారని సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. వరంగల్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. భూపాలప ల్లిలో ఇప్పటికే అన్ని వైద్య సేవలు అందు తున్నా యని, రానున్న రోజుల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి చికిత్సకు వైద్యం అందించే విధం గా ఏర్పాటు చేస్తామన్నారు. మే 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుం దని తెలిపారు. గర్భిణీలకు ప్రత్యేక న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నారని తెలిపారు. కరోనా కాలంలో ముందుండి సేవలందించన వైద్యులు, వైద్య సిబ్బం దికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి రోగుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్ కి రాణి సిబ్బందిని అడిగి తెలుసుకుని ఎందుకు రాలేదని ఆరా తీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏడునూతుల నిశిధర్ రెడ్డి, ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, జెడ్పిటిసి సాయిని విజయ , ఎంపిటిసి మైస సుమలత బిక్షపతి, డీఎంహెచ్ఓ శ్రీరామ్, కంటి వెలుగు ప్రత్యేక అధికారిని డాక్టర్ శ్రీదేవి, వైద్యాధికారులు హిమాబిందు, విష్ణువర్ధన్, పీఏసీఎస్ చైర్మన్ విజ్జన్‌రావు, జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ హింగే మహేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, తాసిల్దార్ షరీఫుద్దీన్, ఎంపీ డీవో సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ బిక్షపతి, మండల ప్రధాన కార్యదర్శి శంకరయ్య, నాయకులు ఉమేష్ గౌడ్, కేసిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఐలి శ్రీధర్ గౌడ్, సి హెచ్ ఓ లింగారెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు సుధా, రాము, ఏఎన్ఎం యధా లక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ శంకర్, కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.