Authorization
Thu February 27, 2025 11:55:10 pm
- వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ- వరంగల్
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నీటి సరఫరా లో ఎదుర య్యే సాంకేతికపరమైన సమస్యలను గుర్తించి అధ్యయన నివేదిక సమర్పించా లని నగర మేయర్ గుండు సుధారాణి కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదే శించారు. మంగళవారం గ్రేటర్ పరిది కాకతీయ యూనివర్సిటీ ఫిల్టర్ బెడ్ లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డ్ విశ్రాంత ఆపరేషన్ డైరెక్టర్ రవి కుమార్, బల్దియా, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులతో కలసి నీటి సరఫరా లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మా ట్లాడుతూ నీటి సరఫరాలో సమస్యలను గుర్తించి పూర్తి నివే దిక సమర్పించే దుకు నిపుణులైన రవికుమార్, నిపుణుల బృందం కొన్ని రోజుల పాటు నగరంలో ఉంటారని అన్నారు. వారి సహకారంతో 66 డివిజన్లలో నీటి సరఫ రా సమ స్యలైన వాల్వ్‌లు, లికేజ్లు, పైపులైన్లు, తక్కువ ప్రెషర్ గల ప్రాంతాలు, తగినంత నీటి సరఫరా జరగని ప్రాంతాలను గుర్తించి, సాంకేతిక పరమైన సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కా రానికి చర్యలు తీసుకోవాల న్నారు. అనంతరం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డ్ రిటైర్డ్ డైరెక్టర్ తో కలిసి పబ్లిక్ హెల్త్ బల్దియా ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో దేశాయిపేట ఫిల్టర్ బెడ్ పరిధి నీటి సరఫ రాలో సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. ఈ సమావేశంలో హెచ్ఎండబ్ల్యుఎస్ ఎస్బి రిటైర్డ్ ఆపరేషన్ డైరెక్టర్ రవికుమార్, బల్దియా ఎస్ఈ ప్రవీణ్ కుమార్, పబ్లిక్ హెల్త్ బల్దియా ఈఈ లు బిఎల్ శ్రీనివాస్‌రావు, రాజ్‌కుమార్, సంజరుకుమార్, డిఈలు నరేందర్ సంతోష్ బాబు రవికుమార్, సారంగం,రవీందర్, రవి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.