Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్రలో మిస్సింగ్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
'హాత్ సే హాత్ జోడో' పాదయాత్రలో చేయి కలపం దెవ్వరు ? అన్న చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిదశలో మహబూ బాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేశారు. ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర ముగియ గానే నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిం చాల్సి ఉండగా నియోజకవర్గాన్ని మినహాయించి మహబూ బాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగించారు. దీంతో పార్టీలో నర్సంపేటలో పాదయాత్ర చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తొలి దశలోనే నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్రను రానీయకుండా తానే పాదయాత్రను నిర్వహించడం గమ నార్హం. దీంతో రేవంత్‌రెడ్డికి, 'దొంతి'కి మధ్య తీవ్ర విబేధాలు న్నాయన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఈ ప్రభావం మలిదశలో భాగంగా ఈనెల 15వ తేదీ నుండి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో జరుగనున్న పాదయాత్రపై కూడా పడుతుందా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన 'హాత్ సే హాత్ జోడో' పాదయాత్రకు కాంగ్రెస్ నేతలే సహక రించడం లేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తొలిదశలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ములుగు నియోజకవర్గం నుండి పాదయాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. రెండో నియోజకవర్గమైన నర్సంపేటలో ప్రవేశించాల్సి ఉండగా, ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకొని మహబూబాబాద్ నియోజకవర్గంలో మళ్లీ ప్రారంభించడం గమనార్హం.
సొంతగా 'దొంతి' పాదయాత్ర
రేవంత్‌రెడ్డి పాదయాత్రను అడ్డుకున్న నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దొంతి మాధవరెడ్డి స్వయంగా తానే తన నియోజకవర్గంలో పాదయాత్రను నిర్వహిస్తుండడం గమనార్హం. దీంతో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి, దొంతి మాధవరెడ్డిల మధ్య విభేదాలుండడం వల్లే రేవంత్ పాదయాత్రను నియోజకవర్గంలో కొనసాగ కుండా 'దొంతి' అడ్డుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్ తన పాదయాత్రను పూర్తి చేసుకోవడంతో ఇక నర్సంపేట నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పెండింగ్ డీసీసీల జాప్యమే ...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, జనగామ, భూపా లపల్లి జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం జరుగలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ, ములుగు, మహబూ బాబాద్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించినా, మరో మూడు జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించలేదు. ఈ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడంతోనే ఆ మూడు జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకం నిలిచిపోయింది. ఈ పెండింగ్ వ్యవహారమే పాదయాత్రకు ఆయా నియోజకవర్గాల్లో ప్రతికూలంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని నర్సం పేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దొంతి మాధవరెడ్డి, వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి 'కొండా' దంపతులు తమ అనుచరులకే ఇప్పించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 'దొంతి', 'కొండా'ల మధ్య రాజకీయంగా తీవ్ర విభేధాలున్నాయి. వరంగల్ డీసీసీ పీఠాన్ని తమ అను చరుడికే ఇప్పించుకోవడానికి ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో ఇప్పటికీ ఆ జిల్లా పెండింగ్‌లోనే వుంది. ఈ కారణం వల్లే 'దొంతి' తన నియోజకవర్గంలో రేవంత్ పాదయాత్ర రాకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నా రని పార్టీలో ప్రచారం జరుగుతోంది. జనగామ జిల్లా డీసీసీ పీఠంపై కూడా పీఠముడి బిగుసుకుంది. తొలుత మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికే జిల్లా అధ్యక్ష పదవి ఖాయ మైందన్న ప్రచారం జరిగినా, దీనిపై పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య మెలిక పెట్టడంతో నిలిచిపోయిందన్న ప్రచారం జరుగుతుంది. 'కొమ్మూరి', ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సన్నిహితుడిగా ముద్ర పడడం వల్ల కూడా ఇందులో జాప్యం జరుగుతోంది. జనగామ నియోజకవర్గం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం కింద లేదు. ఈ నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గం పరిధిలో వుంది. ఇదిలావుంటే భూపాలపల్లి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి విష యంలోనూ తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇక్కడ మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే డి. శ్రీధర్‌బాబు తన అనుచరుడికి ఇప్పించుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఈ మూడు జిల్లాల డిసిసిల ఎంపికపై పీఠముడి పడినట్టయ్యింది. ఈ మూడు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో రేవంత్ పాదయాత్రకు సహ కారం లభించడం లేదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. ఇప్పటికైనా ఈ మూడు డీసీసీలపై నిర్ణయం తీసుకుంటారా ? లేదా ? అనే విషయంలో పార్టీ నేతల్లో చర్చసాగుతుంది.